మొదటి రోజు కలెక్షన్స్ తో అదరగొట్టిన దసరా

నేచురల్ స్టార్ నాని ఫస్ట్ టైమ్ చేసిన ఊరమాస్ సినిమా దసరా. ఫస్ట్ లుక్ నుంచే టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా ఉన్న ఈ మూవీపై రిలీజ్ టైమ్ వరకూ భార అంచనాలు పెంచింది టీమ్. ఇక బెస్ట్ యాక్ట్రెస్ గా పేరున్న కీర్తి సురేష్ రెండోసారి నానితో రొమాన్స్ చేసిన సినిమా కావడంతో ఆ జంటపైనా అంచనాలున్నాయి. దీంతో దసరాను ప్యాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ చేశారు.

అందుకోసం నాని కూడా ఓ రేంజ్ లో ప్రమోషన్స్ కూడా చేశాడు. దీంతో ఊహించినట్టుగానే వాల్డ్ వైడ్ గా అద్భుతమైన టాక్ తో పాటు కలెక్షన్స్ కూడా వచ్చాయి. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ మూవీకి రా అండ్ రస్టిక్ గా పేరు వచ్చింది. సింగరేణి ప్రాంతంలోని వీర్లపల్లి అనే గ్రామంలో 1990ల నేపథ్యంలో రాసుకున్న ఈ కథ ఆనాటి కాలాన్ని ప్రతిబింబించడంతో పాటు.. కంటెంట్ పరంగానూ మెప్పించింది. నాని, కీర్తి సురేష్ లతో పాటు మరో ప్రధాన పాత్రలో నటించిన దీక్షిత్ శెట్టి నటనకు కూడా అద్బతుమైన అప్లాజ్ వస్తోంది. కొన్ని చోట్ల కాస్త డివైడ్ టాక్ ఉన్నా.. మాస్ ఆడియన్స్ ను మాత్రం ఊపేస్తోందీ సినిమా.


ఇక భారీ ప్రమోషన్స్ తో భారీ అంచనాల మధ్య విడుదలైన దసరా మూవీ ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 38. 40 కోట్ల గ్రాస్ వసూలు చేసి సత్తా చాటింది. అంటే మొదటి రోజే 21 కోట్ల షేర్ వచ్చిందన్నమాట. ఇది నాని కెరీర్ లోనే ఆల్ టైమ్ బెస్ట్ కలెక్షన్స్. ఇటు తెలుగు స్టేట్స్ లో మాత్రమే చూస్తే.. 24.85కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ పరంగా చూస్తే 14.22 కోట్లు వచ్చిందన్నమాట. మామూలుగా తెలుగు స్టేట్స్ లో మాత్రమే నాని అందరికీ తెలుసు. ప్యాన్ ఇండియన్ రేంజ్ లో అతని గురించి పెద్దగా తెలియదు.

అయినా ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడం అంటే మాటలు కాదు. ఇంకా చెబితే ఈ గురువారం తమిళనాడులో అక్కడి స్టార్ హీరో శింబు నటించిన ‘పాతుతలా’ అనే సినిమా కంటే కూడా బెటర్ గా పర్ఫార్మ్ చేసింది. అలాగే హిందీలోనూ అజయ్ దేవ్ గణ్ భోళా కంటే ఈ చిత్రానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్. సో.. ఈ ఊపు ఇలాగే కొనసాగితే.. వీకెండ్ వరకూ బ్రేక్ ఈవెన్ అయిపోతుందని చెప్పొచ్చు.

Related Posts