అఖండ గెట‌ప్ వెనుక ఎవ‌రున్నారో తెలుసా..?

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌, ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అఖండ‌. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డు క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతుంది. రెండోవారంలో కూడా రికార్డ్ క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతుండ‌డం విశేషం. విడుద‌లైన అన్ని ఏరియాల్లో స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో బాల‌య్య రెండు విభిన్న పాత్ర‌లు పోషించారు.

ఒక‌టి రైతు పాత్ర కాగా రెండోది అఘోరా పాత్ర‌. అయితే.. అఘోరా పాత్ర అంత బాగా సెట్ అవ్వ‌డం వెనుక బోయ‌పాటి కాకుండో మ‌రో వ్య‌క్తి ఉన్నార‌ని తెలిసింది. అయ‌నే.. రామ్జ్. అఖండ పాత్ర వేసే బ్లాక్ డ్రెస్ కోడ్.. పైన ధరించే కాశాయ వస్త్రం.. మెడలో వేసుకునే రుద్రాక్ష మాలలు.. అంతే కాకుండా లెదర్ వస్తువులు… చేతుల పై టాటూలు.. శివుడి మూడో నేత్రం.. చేతిలో ధరించే త్రిశూలం రామ్జ్ డిజైన్ చేసినవే కావడం విశేషం.

బోయ‌పాటి ఈ పాత్ర‌కు సంబంధించి ఇన్ పుట్స్ ఇచ్చారని అయితే.. ఈ పాత్రలో బాలకృష్ణ మేకోవర్ కొన్నేళ్ల పాటు గుర్తిండిపోవాలని అందు కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. ప్రత్యేకమైన వస్త్రాలని తీసుకున్నాం. టూటూలు ప్రత్యేకంగా శివలింగం రూపొందించాం అని తెలిపారు రామ్జ్. సుకుమార్ జ‌గ‌డంతో కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఆత‌ర్వాత నాగార్జున‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌జ‌నీకాంత్ చిత్రాల‌కు వ‌ర్క్ చేశాను. అయితే.. ఇన్నాళ్లు రాని గుర్తింపు అఖండ సినిమాతో రావ‌డం చాలా సంతోషంగా ఉందంటున్నాడు రామ్జ్.

Related Posts