పునర్జన్మల నేపథ్యంలో వచ్చిన సూపర్ హిట్ తెలుగు మూవీస్ తెలుసా..?

పునర్జన్మ.. ప్రపంచ వ్యాప్తంగా ఈ అంశంపై ఎవరికీ పెద్దగా నమ్మకం లేదు. కానీ అప్పుడప్పుడూ.. అక్కడక్కడా పునర్జన్మకు సంబంధించిన వార్తలు వింటుంటాం. అలా విన్నప్పుడు తెలియకుండానే ఎంతో ఆసక్తి చూపుతాం. ఆ ఆసక్తినే వెండితెర కూడా క్యాష్ చేసుకుంటూ వస్తోంది. అయితే పునర్జన్మ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో తొలి బ్లాక్ బస్టర్ గా మూగ మనసులు చిత్రాన్నే చెప్పాలి.
పడవ నడుపుకునే నాగేశ్వరరావు జమీందారుగారి అమ్మాయి అయిన సావిత్రిపై ఒక రకమైన అభిమానాన్ని పెంచుకుంటాడు. ఆమెకూ అతనంటే అలాంటి అభిమానమే. కానీ ప్రేమగా గుర్తించే సరికి ఆమెకు పెళ్లవుతుంది. ఆ పెళ్లి సంతోషం ఎంతో కాల�