ఏపీలో క‌రోనా గైడ్ లైన్స్.. సంక్రాంతి సినిమాలు గ‌ట్టెక్కుతాయా..?

క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో ప్ర‌తి రోజు ల‌క్ష‌కు పైగా కేసులు న‌మోదు అవుతున్నాయి. దీంతో కేంద్రం రాష్ట్ర‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. అయితే.. ఏపీలో రోజురోజుకు కేసులు న‌మోదు అవుతుండ‌డంతో రాత్రి 11 గంట‌ల ఉంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు కర్ఫ్యూ ఉంచాలని సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశించారు. అలాగే థియేటర్లలో సీటు మార్చి సీటుకు 50 శాతం అనుమతించాలని కూడా ఆదేశాలు జారీ చేయ‌డం జ‌రిగింది.

వేరే రాష్ట్రాల్లో సినిమా థియేట‌ర్లో 50 శాతం సీట్ల‌ను మాత్ర‌మే అనుమతించారు. మ‌న తెలుగు రాష్ట్రాల్లో 100 శాతం సిటింగ్ కి ఓకే కాబ‌ట్టి సంక్రాంతికి రానున్న‌ సినిమాల‌కు పెద్ద‌గా ఇబ్బంది ఏమీ ఉండ‌దు అనుకున్నారు. అయితే.. తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్ ఏపీలో సినిమా థియేట‌ర్లో 50 సిటింగ్ కి మాత్ర‌మే అనుమ‌తించాల‌ని ఆదేశించ‌డంతో సంక్రాంతి రానున్న సినిమాల‌కు ఇబ్బందే అని చెప్ప‌చ్చు.

అయితే.. గ‌త సంవ‌త్స‌రం సంక్రాంతికి 50 శాతం సిటింగ్ కి మాత్ర‌మే అనుమ‌తి ఉన్న‌ప్ప‌టికీ ర‌వితేజ క్రాక్ చిత్రం రిలీజై పెద్ద విజ‌యం సాధించింది. ఆ లెక్క‌న 50 శాతం సిటింగ్ ఉన్న‌ప్ప‌టికీ సినిమాకి మంచి టాక్ వ‌స్తే.. క‌లెక్ష‌న్స్ భారీగా వ‌చ్చే అవ‌కాశం ఉంది. మ‌రి… ఈ సంక్రాంతి సినిమాలు క‌రోనా గండం నుంచి గ‌ట్టెక్కుతాయా..? లేదా..? ఎంత వ‌ర‌కు క‌లెక్ట్ చేస్తాయి అనేది చూడాలి.