ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన జ‌క్క‌న్న‌
Latest Movies Tollywood

ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన జ‌క్క‌న్న‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ క్రేజీ మూవీ ఆర్ఆర్ఆర్. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే.. ఆర్ఆర్ఆర్ టీజ‌ర్ అండ్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కానీ.. ట్రైల‌ర్ ఇంకా రిలీజ్ కాలేదు. అయితే.. డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ లో ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ రిలీజ్ కానుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌చ్చాయి.

అయితే.. సినిమా రిలీజ్ నెల రోజులు ఉంద‌న‌గా ట్రైల‌ర్ రిలీజ్ చేస్తారా..? ఇదేదో గాసిప్ అనుకున్నారు కానీ.. జ‌క్క‌న్న ఈరోజు ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్స్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రేపు ఆర్ఆర్ఆర్ నుంచి జ‌న‌ని అనే సాంగ్ రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా మీడియా ముందుకు వ‌చ్చిన రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ ను డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ లో రిలీజ్ చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. అలాగే నెంబ‌ర్ ఆఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉన్నాయ‌ని.. అలాగే ఆర్ఆర్ఆర్ గురించి మీడియా అడిగే అన్ని ప్ర‌శ్న‌ల‌కు త్వ‌ర‌లోనే ప్రెస్ కాన్ఫిరెన్స్ ద్వారా స‌మాధానాలు చెబుతాన‌ని అన్నారు.

Post Comment