వినాయక్ దూకుడు..  జోష్ లో బెల్లంకొండ

మాస్ హీరో అయిపోదామని ఫస్ట్ మూవీ నుంచే బెస్ట్ ఎఫర్ట్స్ తో దూసుకుపోతున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఎంచుకునే కథలు కూడా ఆ దిశగానే ఉంటున్నాయి. బట్ విజయాల విషయంలో మాత్రం అతనికి ప్రతిసారీ చుక్కెదురైంది. చివరగా తమిళ్ బ్లాక్ బస్టర్ రాక్షసుడు రీమేక్ తో మంచి విజయం అందుకున్నాడు. అయితే గతంలో అతను చేసిన సాలిడ్ యాక్షన్ మూవీస్, ముఖ్యంగా జయ జానకి నాయకి వంటి చిత్రాల కారణంగా హిందీలో డబ్బిగ్ మార్కెట్ ఓ రేంజ్ లో పెరిగింది. ఎంత అంటే ఇక్కడ టాప్ హీరోల రేంజ్ లో అతనికి అక్కడ డబ్బింగ్ మార్కెట్ ఉంది. దీంతో ఆ మార్కెట్ ను స్ట్రెయిట్ గా దున్నేయాలని రంగంలోకి దిగాడు. తెలుగులో ప్రభాస్ కు బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఛత్రపతిని బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నాడు. ఈ మూవీకి మన మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం చేస్తున్నాడు. తెలుగులో చాలామంది హీరోలను మాస్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసిన వినాయక్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై చాలామంది దృష్టి ఉంది.
మొదట్లో తెలుగులో లాగా హిందీలోనూ శ్రీనివాస్ కోసం ఓ టాప్ హీరోయిన్ ను తీసుకోవాలనుకున్నారు. బట్ బడ్జెట్ ప్రాబ్లమ