HomeMoviesబాలీవుడ్బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న 'స్త్రీ-2'

బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘స్త్రీ-2’

-

బాలీవుడ్ లో ఆగస్టు 15న విడుదలైన సినిమాలో ‘స్త్రీ-2’ ఒకటి. గతంలో వచ్చిన ‘స్త్రీ’ సినిమాకి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. అందుకే.. ఈ మూవీకి హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. హారర్ జానర్‌పై వారికి ఉన్న ఇష్టం, ‘స్త్రీ’ ఫ్రాంచైజీపై ఉన్న క్రేజ్ కారణంగా ఈ మూవీకి తొలిరోజు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి.

తొలి రోజు ‘స్త్రీ-2’ చిత్రం రూ.64.80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. 2024లో ఇప్పటివరకూ విడుదలైన హిందీ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ రికార్డు ఇదే. స్టార్ హీరోల సినిమాలను మించి ‘స్త్రీ 2’ సాధించిన ఈ విజయం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది.

పంద్రాగస్టున బాలీవుడ్ లో మూడు సినిమాలొచ్చాయి. వాటిలో ‘స్త్రీ-2’ ఒకటి. అయితే.. సోలో రిలీజ్ అయి ఉంటే ఈ సినిమా ఇంకా ఎక్కువ కలెక్షన్స్ సాధించేది అని ట్రేడ్ పండిట్స్ విశ్లేషిస్తున్నారు.

ఫస్ట్ డే నుంచే ‘స్త్రీ-2’కి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ వంటి నటులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మున్ముందు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

ఇవీ చదవండి

English News