బాలీవుడ్ ను అదరగొడుతోన్న దృశ్యం 2

ఒక్క హిట్ కావలెను.. చాలాకాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీ ముందు పెట్టి ఉంచిన బోర్డ్ ఇది. ఎన్ని వైవిద్యమైన ప్రయత్నాలు చేసినా వాళ్లు విజయం అనే మాటను వినలేకపోతున్నారు. అందుకు కారణం.. కంటెంట్. ఇప్పటి వరకూ వారి నుంచి వస్తోన్న సినిమాలన్నీ కంటెంట్ లెస్ అని ఓటిటి వచ్చిన తర్వాత.. సౌత్ సినిమాలు నార్త్ లో సత్తా చాటుతున్న తర్వాతే వారికి తెలిసింది.

ఇప్పటికే హిట్ కోసం దక్షిణాది దర్శకులను కూడా తీసుకుంటున్నారు. ఇంకేవో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఈ యేడాది భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాలన్నీ అంతే భారీగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇందులో స్టార్ హీరో లనుంచి స్మాల్ హీరోల వరకూ ఉన్నారు. ఇక 2022 నో బ్లాక్ బస్టర్స్ అని బోర్డ్ పెట్టుకుంటుంది అనుకుంటోన్న టైమ్ అనూహ్యంగా దృశ్యం2తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ పడింది. అఫ్ కోర్స్ ఇది కూడా సౌత్ సినిమానే..


మళయాలంలో వచ్చిన దృశ్యంకు సీక్వెల్ గా వచ్చిన దృశ్యం2 కూడా అదే రేంజ్ లో సూపర్ హిట్ అయింది. దృశ్యంను గతంలోనే దాదాపు అన్ని భాషల్లో రీమేక్ చేశారు. తెలుగులో వెంకటేష్‌, కన్నడలో రవిచంద్ర, తమిళ్ లో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవ్ గణ్‌ చేశారు.

దృశ్యం2ను తెలుగులోనూ వెంకటేష్‌ చేసినా.. అది ఓటిటికే పరిమితం అయింది. తమిళ్, కన్నడ నుంచి ఇంకా సౌండ్ లేదు. బట్ బాలీవుడ్ వాళ్లు రీమేక్ చేశారు. మామూలుగా మళయాలీ సినిమాలు లెంగ్తీగా ఉంటాయి కదా.. హిందీ వాళ్లు ఈ సారి తెలివిగా ఆ లెంగ్త్ ను తగ్గించారు.

దీంతో మామూలుగా థ్రిల్లర్ సినిమా అయిన దృశ్యం2 మరింత క్రిస్ప్ గా డైరెక్ట్ గా ఆడియన్స్ ను థ్రిల్ చేస్తోంది. దీంతో రిలీజ్ రోజే సూపర్ హిట్ రావడంతో ఆడియన్స్ పెరిగారు. కట్ చేస్తే ఫస్ట్ వీకెండ్ కే వంద కోట్ల వరకూ కలెక్ట్ చేసింది. ఇప్పటికీ కలెక్షన్స్ స్టడీగా ఉండటంతో ఫుల్ రన్ లో దాదాపు 250 కోట్ల వరకూ వసూలు అవుతుందనుకుంటున్నారు. మొత్తంగా ఇది చిన్న బడ్జెట్ సినిమానే. కాబట్టి ఈ కలెక్షన్స్ తో హిందీ దృశ్యం2 బ్లాక్ బస్టర్ గానే ఒప్పుకోవాలి.

Related Posts