HomeMoviesబాలీవుడ్ఐకాన్ స్టార్ తో డ్యాన్సింగ్ క్వీన్ స్టెప్పులు

ఐకాన్ స్టార్ తో డ్యాన్సింగ్ క్వీన్ స్టెప్పులు

-

ఈ జెనరేషన్ హీరోయిన్స్ లో డ్యాన్సులంటే ముందుగా గుర్తుచ్చే పేరు శ్రీలీల. ‘గుంటూరు కారం’ సినిమాలో కుర్చీ మడతపెట్టి గీతంలో శ్రీలీల వేసిన మాస్ స్టెప్పుల గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీలీల తో డ్యాన్స్ అంటే హీరోలకు తాట ఊడిపోద్ది అన్న రీతిలో ఏకంగా మహేష్ బాబు కూడా ఆమె డ్యాన్సుల గురించి ప్రశంసలు కురిపించాడు. అలాంటి శ్రీలీల ఇప్పుడు డ్యాన్సులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే అల్లు అర్జున్ తో స్టెప్పులేసింది. అది కూడా ‘పుష్ప 2’ కోసం.

‘పుష్ప 2’ సినిమాలోని స్పెషల్ నంబర్ కోసం అల్లు అర్జున్-శ్రీలీల కలిసి వేసిన స్టెప్పులు డ్యాన్స్ ఫీస్ట్ అందిస్తాయని ప్రకటించింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. అందుకు సంబంధించి శ్రీలీల పోస్టర్ ను రిలీజ్ చేసింది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ పాటను కంపోజ్ చేశాడు. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ‘పుష్ప 2’ రిలీజ్ కు రెడీ అవుతుంది.

ఇవీ చదవండి

English News