వివాదంలో అమీర్ ఖాన్ తనయుడి తొలి చిత్రం

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ వారసుడు వస్తున్నాడు. ఆయన తనయుడు జునైద్ ఖాన్ తొలి చిత్రం ‘మహారాజ్’ విడుదలకు ముస్తాబైంది. అయితే.. థియేటర్లలో కాదు.. నెట్ ఫ్లిక్స్ వేదికగా జూన్ 14 నుంచి ‘మహారాజ్’ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఇక.. విడుదలకు ముందే ఈ సినిమా వివాదాల్లో చిక్కుకుంది.

1862 నాటి మహారాజ్ లిబెల్ కేసు ఆధారంగా.. వాస్తవ సంఘటనలతో రూపొందిన చిత్రం ‘మహారాజ్’. లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న ఒక పూజారి కథతో ఈ సినిమా సాగుతోంది. ఈ మూవీలో జైదీప్ అహ్లావత్, షాలిని పాండే, శర్వరి ఇతర కీలక పాత్రలు పోషించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సిద్ధార్థ్ పి మల్హోత్రా ఈ సినిమాని తెరకెక్కించాడు.

అయితే.. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలను బట్టి ఈ సినిమాలో హిందూ మతాన్ని కించపరిచే సన్నివేశాలున్నాయని.. విడుదలకు ముందే తమకు సినిమాని చూపించాలని విశ్వ హిందూ పరిషత్.. నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ కు లేఖ రాసింది. గతంలో అమీర్ ఖాన్ నటించిన ‘పి.కె’ సినిమా విషయంలోనూ ఇలాంటి వివాదాలు వచ్చాయి. ‘మహారాజ్’ చిత్రం కోసం దాదాపు 26 కేజీల బరువు తగ్గి సరికొత్తగా మేకోవర్ అయ్యాడు జునైద్ ఖాన్..

Related Posts