సినిమా ఇండస్ట్రీకి బిగ్ రిలీఫ్

వకీల్ సాబ్ సినిమా టైమ్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు తగ్గించారు. అది కూడా దారుణంగా తగ్గించారు. దీంతో చాలామంది నిర్మాతలు నష్టపోయారు. పోతున్నారు. ముఖ్యంగా పెద్ద సినిమాలకు ఈ టికెట్ రేట్లు శరాఘాతంలా తగిలాయి. కొందరైతే ఏకంగా థియేటర్స్ ను కూల్చేశారు కూడా. ఈ విషయంలో టికెట్ రేట్లను పెంచాలని పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి అనేకసార్లు మొరపెట్టుకున్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వీరి మొర ఆలకించలేదు. చిరంజీవి వంటి పెద్ద మనిషి అడిగినా వినలేదు. అక్కడ టికెట్ రేట్లు దారుణంగా ఉండటం వల్లే లేటెస్ట్ గా వచ్చిన అఖండకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా.. ఆంధ్రలో కొన్ని ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన కు రాలేదు. ఇక రాబోయే పుష్పతో పాటు ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్, ఆచార్య వంటి సినిమాలకు షాక్ తప్పదు అనుకుంటోన్న టైమ్ లో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
టికెట్ రేట్లు తగ్గిస్తూ.. ఏపి ప్రభుత్వం తెచ్చిన జివో నెంబర్ 35 ను తెచ్చింది. అప్పటి నుంచే సినిమా వారికి కష్టాలు మొదలయ్యాయి. అసలే కరోనాతో తీవ్రంగా నష్టపోయిన బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఈ జివో వల్ల మరింతగా ఇబ్బంది పడ్డారు. చివరికి థియేటర్ల యాజమాన్యాలు వేసిన పిటిషిన్ ను స్వీకరించిన కోర్ట్.. పిటిషనర్ తరఫున న్యాయవాదుల వాదనలో ఏకీభవించింది. ఈ జివో అసంబంధం అంటూ కొట్టివేసింది. దీంతో జగన్ ప్రభుత్వానికి మరోసారి కోర్ట్ లో చుక్కెదురైనట్టయింది.
నిజానికి సినిమా పరిశ్రమ విన్నవించుకున్నప్పుడే జగన్ ఓ నిర్ణయం తీసుకుని ఉంటే గౌరవం దక్కేది. ఇప్పుడు గౌరవమే కాదు.. పరువూ పోయింది. అందుకే అంటారు దేన్నైనా తెగేదాకా లాగొద్దని.. మొత్తంగా థియేటర్ యాజమాన్యాలు ఇచ్చిన షాక్ కు జగన్ కు బొమ్మ కనిపించింది. ఇక వారిపై మరిం కక్ష కట్టి ఇంకెన్ని పనికిమాలిన నిర్ణయాలు తీసుకుంటాడో చూడాలి.

Related Posts