భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ కన్ఫార్మ్ .. ఈ సారి తగ్గేదే లే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి స్క్ర్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన భీమ్లా నాయక్ మళయాలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ కు రీమేక్. అయినా తెలుగులో చాలా మార్పులు చేసినట్టు టీజర్, సాంగ్స్ చూస్తే తెలుస్తుంది. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇమేజ్ వేరు కదా.. అందుకే ఆ మార్పులు తప్పవు అనేది మేకర్స్ వెర్షన్. పవన్ సరసన నిత్య మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటించారు. పోలీస్ అంటే పొలిటీషియన్ ఇగో డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ కోసం బలవంతంగా పోస్ట్ పోన్ చేయించారు. తీరా చూస్తే అటు ఆర్ఆర్ఆర్ లేదు. ఇటు భీమ్లా నాయక్ రావడానికి లేదు. అయితే పోస్ట్ పోన్ అయిన టైమ్ లోనే ఫిబ్రవరి 25న విడుదల చేస్తాం అని కొత్త డేట్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ డేట్ నే వస్తున్నాం అని లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు.
అంటే ఫిబ్రవరి 24నే భీమ్లా నాయక్ ఓవర్శీస్ ప్రీమియర్స్ పడతాయి. ఒక రోజు ముందుగానే రిజల్ట్ తెలియబోతోందన్నమాట. ప్రస్తుతం ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. అటు ఏపిలో 50పర్సెంట్ మాత్రమే ఆక్యుపెన్సీ అని బోర్డ్ పెట్టారు. అయినా తను వచ్చినప్పుడు ఎలాగూ ఏపి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని తెలుసు కదా.. అందుకే పవన్ కూడా వెనకడుగు వేసేదే లేదని ముందుకే దూకేస్తున్నాడు. మొత్తంగా ఆర్ఆర్ఆర్ వల్ల నెలకు పైగా ఆలస్యం అయినా.. భీమ్లా నాయక్ కు వచ్చిన ఇబ్బందేం లేదు. ఓ రకంగా అంతా తప్పుకున్నా.. తను మాత్రం ఈ పాండమిక్ టైమ్ లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నాడు పవన్. అంటే సంక్రాంతి తర్వాత సమ్మర్ కు మధ్యలో బిగ్గెస్ట్ మూవీగా భీమ్లా నాయక్ రాబోతోందన్నమాట.

Related Posts