బోయపాటి, రవితేజకు పోటీగా బాలయ్య ..?

ఫెస్టివల్ సీజన్స్ లో సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ పండగే. హాలిడేస్ కలిసొస్తాయి. ఎక్కువమంది చూస్తారు. బావుంటే మరోసారీ చూస్తారు. అందుకే పెద్ద సినిమాలన్నీ ఆ టైమ్ కే షెడ్యూల్ అవుతుంటాయి. సమ్మర్ మూవీస్ కు సంబంధించి ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. ఇండిపెండెన్స్ డే టైమ్ లోనూ కొన్ని సినిమాలున్నాయి. అయితే సమ్మర్ తర్వాత అందరి దృష్టీ ఉండేది మాత్రం దసరాపైనే. అందుకే ఇప్పటి నుంచే కర్చీఫ్ లు వేస్తున్నారు మేకర్స్.

వీరిలో ముందుగా డేట్ అనౌన్స్ చేసింది రామ్ పోతినేని. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్ 20న విడుదల చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ కంప్లీట్ గా బోయపాటి మార్క్ లో సాగే యాక్షన్ ఎంటర్టైనర్. ఇక అప్పటికి ఎవరూ ప్రకటించలేదు కాబట్టి.. పోటీపై ఆసక్తి ఉంది. అయితే ఆ వెంటనే మాస్ మహరాజా రవితేజ అనౌన్స్ చేశాడు.


ఇప్పటికే వరుస రిలీజెస్ తో దూసుకుపోతోన్న మాస్ రాజా ఏప్రిల్ 7న రావణాసురగా రాబోతున్నాడు. ఆ తర్వాత వచ్చే సినిమా టైగర్ నాగేశ్వరరావు. స్టూవర్ట్ పురం దొంగ నాగేశ్వరరావు కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కూడా అక్టోబర్ 20నే విడుదల చేయబోతున్నాం అని ప్రకటించి పోటీని ఫిక్స్ చేశారు. లేటెస్ట్ గా ఈ కాంపిటీషన్ లోకి గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలయ్య కూడా వచ్చేశాడు అని టాక్.
అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందుతోన్న ఎన్బీకే 108 చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్ 21న విడుదల చేయబోతున్నారని సమాచారం. రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూసి చాలామంది బాలయ్యకు మరో హిట్ గ్యారెంటీ అనుకున్నారు.

అది నిజమే అనేలా ఇండస్ట్రీ నుంచి కూడా టాక్స్ వస్తున్నాయి. బాలయ్య ఇమేజ్ ను బ్యాలన్స్ చేస్తూనే తనదైన శైలిలో ఎంటర్టైన్మెంట్ అందివ్వబోతున్నాడట అనిల్ రావిపూడి. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రీ లీల ఓ కీలక పాత్ర చేస్తోంది. మొత్తంగా దసరాకు ఇంకా ఆరు నెలలకు పైగానే టైమ్ ఉన్నా.. మనోళ్లు తొందరపడుతున్నారంటే.. ఆ టైమ్ కు ఉండే క్రేజ్ అర్థం అవుతోంది కదా..? మరి ఇప్పటికైతే వీరు ముగ్గురే బరిలో ఉన్నారు. వీరేనా.. ఇంకా ఎవరైనా మేము సైతం అంటారా అనేది చూడాలి.

Related Posts