మంచు ఫ్యామిలీలో మరో రచ్చ ..

హీరోలు, అన్నదమ్ములు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. తన అన్న విష్ణు.. ఇళ్లలోకి చొరబడి తన వాళ్లను, బంధువుల్ని ఇలా కొడుతుంటాడని, ఇది సిచ్యుయేషన్ అంటూ మనోజ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. వీడియోలో విష్ణు ఎవరిపైకో దూసుకెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆయనను అదుపు చేస్తున్నట్లు ఉంది. కాగా మనోజ్ పెళ్లి సమయం నుంచి అన్నదమ్ముల మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. విష్ణు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసీ చేయగానే వైరల్ అయిపోయింది. గతంలో ఇలాంటివి కుటుంబ వ్యవహారాలుగా మాత్రమే కనిపించేవి.

బట్.. ఆ కుటుంబ విషయాన్ని స్వయంగా మనోజే బయట పట్టాడు కాబట్టి మీడియాలో వైరల్ అయిపోతోంది. నిజానికి ఈ అన్నదమ్ముల మధ్య ఎప్పటి నుంచో విభేదాలున్నాయని తెలిసివాళ్లంతా చెప్పుకుంటారు. అయినా తన అన్న మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పోటీ చేసినప్పుడు మనోజ్ స్వయంగా ఎంతోమంది వద్దకు వెళ్లి ఓటు వేయమని అడిగాడు. ఓటింగ్ రోజు కూడా చాలా విషయాలు దగ్గరుండి చూసుకున్నాడు. అయినా విష్ణుకు మనోజ్ అంటే ముందు నుంచీ పెద్దగా ఇష్టం ఉండేది కాదు అనేది చాలామంది చెప్పే మాట. ఇక సినిమాల్లో లాగా మనోజ్ వద్ద పనిచేసే ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి దాడికి ప్రయత్నించాడు విష్ణు.

దాన్ని వాళ్లు అడ్డుకున్నారు. బట్ ఇలాంటి నిత్యం జరుగుతాయని మనోజ్ చెప్పడం మాత్రం వీరి మధ్య విభేదాలకు పరాకాష్ట. మరోవైపు విష్ణు ఇలా ఎన్నిసార్లు చేసి ఉంటే మనోజ్ ఆ విషయాన్ని పబ్లిక్ లో పెడతాడు.. అనే వారూ ఉన్నారు. ఇక మనోజ్ పెళ్లి టైమ్ లో కూడా అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగాయని చెబుతుంటారు. అవన్నీ ఎలా ఉన్నా.. ఇద్దరూ లిబరల్ గా ఉన్నారు. ఎవరి లైఫ్ వారిది. ఇలా మరొకరి వ్యక్తిగత విషయాల్లోకి చొచ్చుకు పోయేంత పగ పెంచుకున్నారంటే ఖచ్చితంగా వీరి మధ్య ఇంకేదో జరిగే ఉంటుందని టాలీవుడ్ లో చెవులు కొరుక్కుంటున్నారు.

అయితే ఈ ఇద్దరికీ తండ్రి మోహన్ బాబే. కానీ తల్లులు మాత్రం వేరని ఈ తరంలో చాలామందికి తెలియదు. లక్ష్మీ, విష్ణు.. మోహన్ బాబు మొదటి భార్య సంతానం. మనోజ్ రెండో భార్య కొడుకు. ఈ వైరుధ్యం మనోజ్, విష్ణుల మధ్య ముందు నుంచీ ఉందని వారి గురించి బాగా తెలిసిన వారు చెప్పుకుంటారు. ఏదేమైనా సెలబ్రిటీస్ గా చెప్పుకునే వీళ్లు చీప్ గా కొట్టుకోవడం చూసి.. నెటిజన్స్ అంతా మోహన్ బాబు పెంపకం గురించి సెటైర్స్ వేస్తున్నారు. అయినా మోహన్ బాబు ఈ గొడవ గురించి కంటే.. ఆ గొడవను పబ్లిక్ లో పెట్టిన మనోజ్ పైనే మండిపడుతున్నాడట. కాస్త వింతగా ఉన్నా.. ఈ తాజా పంచాయితీ.. మీమర్స్ కు ట్రోలర్స్ కు కావాల్సినంత స్టఫ్ ఇచ్చిందని మాత్రం చెప్పొచ్చు.

Related Posts