Movies

రామారావు కోసం మరో బ్యూటీ

క్రాక్ చిత్రం సక్సెస్ తో ఫుల్ జోష్ లోకి వచ్చిన రవితేజ…ఆ తర్వాత వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. ముందుగా రమేష వర్మ డైరెక్షన్లో ఖిలాడీ చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు రవితేజ. టీజర్ రిలీజై ఆకట్టుకుంది. షూటింగ్ కూడా ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. ఖిలాడీపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఖిలాడీ తర్వాత రామారావు ఆన్ డ్యూటీ పేరుతో రవితేజ కొత్త సినిమా రాబోతుంది.

ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్లో సుథారక్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరత్ మండవ దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. గతంలో ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ ని తీసుకున్నారు. ఇప్పుడు తమిళంలో కర్ణన్ సినిమాలో నటించి మెప్పించిన రాజీషా విజయన్ ని మరో హీరోయిన్ గా తీసుకున్నట్లు ప్రకటించారు. కొద్ది రోజులుగా హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో హీరోయిన్లు ఇద్దరు పాల్గొంటున్నారు. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది.

Post Comment