జాన్వీ కపూర్ కావాలంటోన్న అఖిల్..

ఇండస్ట్రీలో ఏ హీరోకూ లేని విధంగా కెరీర్ ఆరంభం నుంచీ స్ట్రగుల్ అవుతున్న స్టార్ అఖిల్. మొదటి మూడు సినిమాలు అఖిల్, హలో, మజ్ను చిత్రాలు పోయాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మాత్రం కొంత వరకూ ఆకట్టుకుంది. ఆ తర్వాత భారీ బడ్జెట్, భారీ అంచనాల మధ్య వచ్చిన ఏజెంట్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిది.

దీంతో ఇప్పటికే అఖిల్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది. బట్ ఈ ఫీల్డ్ లో ఇలాంటివి ఎవరికైనా కామన్. ఓ సాలిడ్ హిట్ పడితే మళ్లీ అన్నీ మర్చిపోతారు. ఈ విషయంలో అఖిల్ కు ఇంకా ఎదురుచూపులే నడుస్తున్నాయి. ముఖ్యంగా ఏజెంట్ పై అతను ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో తన కెరీర్ కు ఓ స్టాండర్డ్ వస్తుందని కూడా భావించాడు. అటు అక్కినేని ఫ్యాన్స్ సైతం ఏజెంట్ గ్యారెంటీ హిట్ అనుకున్నారు. బట్.. ఓవరాల్ గా ఈ చిత్రం బాగా నిరాశపరిచింది.


ఇక ఏజెంట్ రిజల్ట్ ఎలా ఉన్నా.. అఖిల్ మాత్రం నెక్ట్స్ స్టెప్ కు సిద్ధమవుతున్నాడు. అది కూడా ధీరుడులా. యస్.. ఈ చిత్రానికి ”ధీర” అనే టైటిల్ పెట్టేశారు. అనిల్ కుమార్ అనే ఓ కొత్త దర్శకుడు పరిచం కాబోతోన్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించబోతుండటం విశేషం. ఈ దర్శకుడు గతంలో సాహో చిత్రానికి పనిచేశాడట. అది కూడా యూవీ బ్యానర్ చిత్రమే కదా. అందుకే అతని టాలెంట్ ను తెలిసే ఈ అవకాశం ఇస్తున్నారు అంటున్నారు.


ఇక అన్నిటికంటే విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియన్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం బాలీవుడ్ బ్యూటీ.. ప్రస్తుతం ఎన్టీఆర్ – కొరటాల మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరి తను ఒప్పుకుంటుందా లేదా అనేది చెప్పలేం కానీ.. ప్రస్తుతం అఖిల్ కు హీరోయిన్ మాత్రమే కాదు.. ఇతర ప్యాడింగ్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. లేదంటే ఇప్పుడప్పుడే తను ఒక్కడే ఒక చిత్ర కథ మొత్తాన్ని మోసేంత స్ట్రెంత్ ఇంకా రాలేదని అర్థం అవుతోంది కదా..? ఇక ధీర అనే టైటిల్‌ ఫిక్స్ చేసుకున్న ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రాబోతోంది.

Related Posts