Latest Movies

తండ్రి సెంటిమెంట్ పై ఆది నమ్మకం

ఆది సాయికుమార్ నటిస్తున్న మరో కొత్త సినిమా అమరన్ ఇన్ ది సిటీ ఛాప్టర్ 1. బాలవీర్ ఈ చిత్రానికి దర్శకుడు. అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆది ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఆది తండ్రి సాయికుమార్ కు కూడా పోలీస్ పాత్రలో నటించిన తర్వాతే బిగ్ బ్రేక్ వచ్చింది. ఆ సెంటిమెంట్ తనకూ రిపీట్ అవుతుందనే నమ్మకంలో ఉన్నాడు ఆది సాయికుమార్. మరోవైపు ఆది వీరభద్రం చౌదరి దర్శకత్వంలో కిరాతక అనే క్రైమ్ థ్రిల్లర్ కూడా చేస్తున్నాడు. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రం కూడా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

Post Comment