గ్రాండ్ గా జరిగిన ‘సలార్‘ సక్సెస్ సెలబ్రేషన్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను మళ్లీ ఫుల్ ఫామ్ లో నిలబెట్టిన చిత్రం ‘సలార్‘. రెబెల్ స్టార్ రెబెలియస్ స్క్రీన్ ప్రెజెన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ‘సలార్‘ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ను జరుపుకుంది చిత్రబృందం. విడుదలకు ముందు ఎలాంటి ఈవెంట్స్ ను చేయని టీమ్.. ఇప్పుడు రిలీజ్ తర్వాత గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించింది. భారతనంతో రూపొందిన ‘సలార్‘ తరహాలోనే.. ఎంతో గ్రాండ్యుయర్ గా ఈ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. రెబెల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో పాటు.. సినిమాకి పనిచేసిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్న ఈ ఈవెంట్ కి సంబంధించిన విజువల్స్ తో ఓ గ్లింప్స్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్.

Related Posts