‘కన్నప్ప’ కోసం న్యూజిలాండ్ లో మోహన్ బాబు, విష్ణు

మంచు విష్ణు మెగా ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ఇప్పటికే 90 రోజుల పాటు న్యూజిలాండ్ లో ఓ పెద్ద షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. 600 మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేసిన ఫస్ట్ షెడ్యూల్ దిగ్విజయంగా పూర్తిచేసుకుని ఇండియాకి వచ్చేసింది టీమ్. మళ్లీ లేటెస్ట్ గా న్యూజిలాండ్ లో మరో షెడ్యూల్ షురూ అయ్యింది.మోహన్ బాబు, విష్ణు ‘కన్నప్ప’ కొత్త షెడ్యూల్ కోసం న్యూజిలాండ్ లో విహరిస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, ప్రభాస్ వంటి ఎంతోమంది స్టార్స్ నటిస్తున్నారు. ఈ మూవీలో నటసింహం బాలకృష్ణ కూడా నటించబోతున్నాడనే ప్రచారం ఉంది. దాదాపు ఈ సినిమాలోని 80 శాతం చిత్రీకరణ న్యూజిలాండ్ లోనే జరగనుంది. ‘మహా భారతం‘ సీరియల్‌ ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద విష్ణు నిర్మిస్తున్నాడు.

Related Posts