Advertisement
ఇండియ‌న్ 2 లో మిల్కీబ్యూటీ.
Latest Movies Regional Tollywood

ఇండియ‌న్ 2 లో మిల్కీబ్యూటీ.

Advertisement

యూనివ‌ర్శిల్ హీరో క‌మ‌ల్ హాస‌న్, గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం ఇండియన్ 2. ఈ సినిమాని ఏ ముహుర్తాన ప్రారంభించారో కానీ.. అవాంత‌రాలు వ‌స్తూనే ఉన్నాయి. చాలా సార్లు ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇక ఈ సినిమానే లేద‌నే వార్త‌లు వ‌చ్చాయి. డైరెక్ట‌ర్ శంక‌ర్ ఈ సినిమాని ప‌క్క‌న‌పెట్టి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో పాన్ ఇండియా మూవీ స్టార్ట్ చేశారు. దీంతో ఇండియ‌న్ 2 నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్ర‌యించ‌డం జ‌రిగింది. అనంతరం ఆ వివాదాలన్ని సద్దుమణిగాయి.

ఇక షూటింగ్ ప్రారంభిద్దాం అని అనుకునే సరికి కమల్‌హాసన్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇటీవలే ఆయన కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. అంతకుముందు ఈ సినిమా నుంచి కాజల్‌ అగర్వాల్‌ రూపంలో సమస్య వచ్చింది. ఆమె ప్రెగ్నంట్ కావ‌డంతో ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంది. కాజల్‌ స్థానాన్ని భ‌ర్తీ చేయడానికి చిత్రబృందం అన్వేషణలో పడింది. మొదటగా కాజల్ ప్లేస్ లో త్రిషను తీసుకోవాలి అనుకున్న‌ట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అది అధికారికంగా ప్రకటించలేదు.

తాజా వార్త ఏంటంటే… కాజ‌ల్ ప్లేస్ లో మిల్క్‌ బ్యూటీ తమన్నాని తీసుకోవాలి అనుకుంటున్నార‌ట‌. అయితే.. ఈ సినిమాలో హీరోయిన్‌గా, వయసు మళ్లిన పాత్రలో కనిపించాల్సి ఉంది. తమన్నా ఈ రెండు పాత్రలకు న్యాయం చేస్తుంద‌ని చిత్ర యూనిట్ న‌మ్మ‌కంతో ఉంద‌ట‌. త‌మ‌న్నా కూడా పాత్ర నచ్చడంతో హీరోయిన్‌గా చేసేందుకు అంగీకరంచిందని టాక్‌ వినిపిస్తోంది. త‍్వరలో ఇండియ‌న్ 2లో త‌మ‌న్నా న‌టించ‌నున్న‌ట్టుగా అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌నున్నారని స‌మాచారం. మ‌రి.. త‌మ‌న్నా వ‌య‌సు మ‌ళ్లిన పాత్ర‌లో ఎంత వ‌ర‌కు మెప్పిస్తుందో చూడాలి.
[17:45, 06/12/2021] Ramesh Raj News: సమంత ప్యాన్ ఇండియా థ్రిల్లర్ ‘యశోద’

Advertisement