కొన్ని కాంబినేషన్స్ క్రేజీగా ఉంటాయి. వినగానే ముందు నిజమేనా అని కన్ఫార్మ్ చేసుకోవాలనిపిస్తుంది. అలాంటి కాంబోస్ లో ముఖ్యంగా సీనియర్ హీరోలకు సంబంధించే ఉంటాయి. ఎందుకంటే సీనియర్స్ హీరోయిన్స్ దొరకడం కష్టం. అందుకే వాళ్లు తమకంటే చిన్న భామలతో రొమాన్స్ చేస్తున్నారంటే సర్ ప్రైజింగ్ గా ఉంటుంది. అలా ఈ సారి సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ఓ సీనియర్ హీరోయిన్ నటించబోతోంది. విశేషం ఏంటంటే ఈ పాత్రకు ముందుగా అనుకున్నది ఐశ్వర్యరాయ్ ని. బట్ తను మిస్ అయింది. మరో మిస్ జాయిన్ కాబోతోంది.

సూపర్ స్టార్ రజినీకాంత్, ఐశ్వర్య రాయ్ జంటగా వచ్చిన రోబో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు మరోసారి ఈ కాంబినేషన్ సెట్ చేశారు. రీసెంట్ గా విజయ్ తో బీస్ట్ అనే సినిమా చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఇప్పుడు రజినీకాంత్ జైలర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలోనే ఐశ్వర్యను హీరోయిన్ అనుకున్నారు. బట్ అనుకోని కారణాలతో ఐశ్వర్య రాయ్.. ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. మరి సూపర్ స్టార్ రేంజ్ కు తగ్గ హీరోయిన్ ను వెంటనే సెట్ చేయడం కష్టం అవుతుందేమో అనుకున్నారు. కానీ వీరిని ఎక్కువ కష్టపెట్టకుండానే మన మిల్కీ బ్యూటీ ఎస్ చెప్పేసిందట.

రజినీకాంత్ సరసన తమన్నా నటించబోతోంది. యస్.. ఇప్పటికే మూవీ టీమ్ నుంచి ఈ న్యూస్ కన్ఫర్మ్ అయింది. రజినీకాంత్ వయసును కూడా లెక్క చేయకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో సక్సెస్ రేట్ తగ్గినా తన స్పీడ్ తగ్గలేదు. పైగా కొత్త తరం దర్శకులతో ఎక్కువ పనిచేస్తున్నాడు. అందుకే బీస్ట్ వంటి డిజాస్టర్ ఇచ్చినా.. నెల్సన్ దిలీప్ చెప్పిన కథకు ఓకే అన్నాడు. ఇక ఐశ్వర్య రాయ్ తప్పుకున్న పాత్రకు తమన్నాను సంప్రదించగానే ఓకే అనేసిందట. అందుకు కారణాలూ ఉన్నాయి. రజినీతో సినిమా అంటే రొమాన్స్ కు పెద్దగా ఆస్కారం ఉండదు. తన పాత్రా హుంగానే ఉంటుంది. పైగా సూపర్ స్టార్ తో వర్క్ చేసిన ఎక్స్ పీరియన్స్ ఉంటుంది. అన్నిటికీ మించి అమ్మడికి ఇప్పుడు పెద్దగా క్రేజ్ కూడా లేదు. అందుకే ఈ భారీ సినిమాలో భాగస్వామ్యం అయింది. మరి రజినీ, తమన్నాల కాంబో ఎలా ఉంటుందో చూడాలి.

, , , ,