Advertisement
స‌మంత‌ను ఒప్పించింది మెగాస్టారా..?
Latest Movies Tollywood

స‌మంత‌ను ఒప్పించింది మెగాస్టారా..?

Advertisement

నాగ‌చైత‌న్య‌, స‌మంత పెళ్లైన నాలుగు సంవ‌త్స‌రాల‌కే విడిపోతార‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. ఇది ఆ కుటుంబ స‌భ్యుల‌కే కాదు.. అంద‌రికీ షాకే. అయితే.. విడాల‌కు త‌ర్వాత స‌మంత స్పందించింది కానీ.. నాగ‌చైత‌న్య మాత్రం ఎప్ప‌టిలాగే సైలెంట్ గా త‌న వ‌ర్క్ త‌ను చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. విడాకుల‌తో స‌మంత డిప్రెష‌న్లోకి వెళ్లిన‌ట్లుగా ఆమె స‌న్నిహితులు చెబుతున్నారు. అలాంటి టైంలో ఆమెను మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ ఓదార్చి.. తన దృష్టి మరల్చడంలో భాగంగా పుష్ప మూవీలో ఐటెం సాంగ్ చేయించినట్లు సమాచారం.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే… క్రిస్మ‌స్ ఫెస్టివ‌ల్ కు రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న స‌మంత‌ను త‌మ ఇంటికి ఆహ్వానించారు. ఆ టైమ్ లో అక్క‌డ చిరంజీవి కూడా ఉన్నార‌ట‌. విడాకుల తర్వాత జీవితం గురించి సమంతతో చిరు, చరణ్ మాట్లాడారట. సమంత డల్లుగా ఉండటం గమనించి.. ఆమె దాదాపు డిప్రెషన్లో ఉందన్న సన్నిహితుల మాటల గురించి ప్రస్తావించారట. దీనిని నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే.. బిజీ అవ్వ‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని చిరంజీవే స‌మంతో పుష్ప సినిమాలో ఐటం సాంగ్ చేయించార‌ట‌.

సుక్కుతో కూడా మాట్లాడి ఆయన్ని ఇందుకు ఒప్పించారని సమాచారం. సుక్కు ఐటం సాంగ్ ను బాలీవుడ్ హీరోయిన్ తో చేయించాలి అనుకున్నార‌ట‌. ఒక‌రిద్ద‌రితో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డం కూడా జరిగింది. అయితే.. చిరంజీవి గారు చెప్ప‌డంతో కాద‌న‌లేక స‌మంత‌తో ఆ సాంగ్ చేయించార‌ని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

Advertisement