పోలీసు బిడ్డగా సెల్యూట్‌ చేస్తున్నాః చిరు

పోలీసు బిడ్డగా సెల్యూట్‌ చేస్తున్నాః చిరు


చిరంజీవి కరోనాపై పోరులో భాగంగా నిత్యం ప్రజల్లో, పోలీసులు, వైద్యుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. రోజుకు తనదైన స్టయిల్‌లో సందేశాలను అందిస్తూ తన పెద్ద మనసుని చాటుకుంటున్నారు. ఇటీవల ఆయన సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పట్నుంచి రోజూ చురుకుగా ఉంటున్నారు. రోజూ ఏదో ఒక ప్రత్యేక అంశాలను, విశేషాలను పంచుకుంటున్నారు. తాజాగా ఆయన పోలీస్‌లకు సెల్యూట్‌. కరోనాని కట్టడి చేయడంలో పోలీసులు చేస్తున్న కృషికి ఆయన ఓ పోలీస్‌ బిడ్డగా సెల్యూట్‌ చేస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోని ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. `రెండు రాష్ట్రాల పోలీసుల పనితీరు అద్బుతం. నిద్రాహారాలు మాని, వారు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. హైదరాబాద్‌లో ఉండి ప్రత్యక్షంగా చూస్తున్నా. వారి పనితీరు వల్ల లాక్‌డౌన్‌ చాలా  సక్సెస్‌ఫుల్‌గా సాగుతుంది. అలా జరగడం వల్లే చాలా వరకు కరోనా విజృంభన అదుపులో ఉంది. అలాగే నేను ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నా. పోలీసులకు సహకరించమని, ఈ కరోనాని తుదిముట్టించడంలో, అంతమొందించడంలో వారికి చేదోడువాదోడుగా ఉండాలని, సహకరించాలని వేడుకుంటున్నా. పోలీసులు చేస్తున్న ఈ అమోఘమైన కృషికి ఓ పోలీసు బిడ్డగా, వారికి చేతులెత్తి సెల్యూట్‌ చేస్తున్నా` అని తెలిపారు. చిరు వాళ్ళ నాన్న కానిస్టేబుల్‌ అనే విషయం తెలిసిందే. ఆయన కూడా కొన్నిసినిమాల్లో ఆర్టిస్టులుగానూ నటించారు. అలాగే పోలీసు కష్టాలు ఎలా ఉంటాయనేది చిరుకు ప్రత్యక్షంగా తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి అభినందలు తెలిపారు. ఇలా ఎప్పటికప్పుడు అన్ని శాఖల వారిని అప్రమత్తం చేస్తూ చిరు తన బాధ్యతని చాటుకుంటున్నారు. దీంతో చిరు చేస్తున్న ఇలాంటి మంచి పనుల వల్ల ఫ్యాన్స్ తోపాటు సాధారణ ప్రజలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు మెగాస్టార్‌ ఆధ్వర్యంలో `సీసీసీ` పేరుతో ఓ సంస్థ ప్రారంభమైన విషయం తెలిసిందే. సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ సంస్థకి సినీ తారలు భారీగా స్పందించి విరాళాలు అందించారు. అంతేకాదు పేద కళాకారులకు నిత్యావసర సరుకులు కూడా అందించడం కూడా ప్రారంభించారు. డైరెక్ట్ గా కార్మికుల ఇంటికే సరుకులు అందించే ప్రయత్నం చేస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published.