Advertisement
బాల‌య్య‌కు ఫోన్ చేసిన మెగాస్టార్
Latest Movies Tollywood

బాల‌య్య‌కు ఫోన్ చేసిన మెగాస్టార్

Advertisement

నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి న‌ట‌న‌ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన నటన పవర్ హౌస్ అనే చెప్పాలి. తెర పై ఆయన డైలాగులు చెబుతుంటే.. ప్రేక్షకులు ఈలలు వేసి రచ్చ చేస్తుంటారు. బాలయ్య వంద సినిమాల‌ను పూర్తి చేసుకున్న జోరు త‌గ్గ‌కుండా ఇంకా పెంచి దూసుకెళుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. కుర్ర హీరోలకి సైతం పోటీ ఇచ్చేలా వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. ఇక బాలయ్య కెరీర్ లో సింహ, లెజెండ్ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలు బాలయ్య కెరీర్ లోనే పెద్ద హిట్లుగా నిలిచాయి. ఇక వీరి కలయికలో వ‌చ్చిన‌ మూడవ సినిమా అఖండ. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ డిసెంబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే అఖండ అద్భుత‌మైన విజయం సాధించింది అనే టాక్ సొంతం చేసుకుంది. ఓవ‌ర్ సీస్ లో సైతం ఈ యాక్ష‌న్ మూవీకి రికార్డు క‌లెక్ష‌న్స్ వ‌స్తుండ‌డం విశేషం.

ఇదిలా ఉంటే.. బాల‌య్య అఖండ ఇండ‌స్ట్రీలో ఓ ఊపు తీసుకువ‌చ్చింది. థియేట‌ర్ల ద‌గ్గ‌ర ఫ్యాన్స్ హంగామా, థియేట‌ర్లో పేప‌ర్లు క‌ట్ చేసి వేయ‌డం.. ఈల‌లు, చ‌ప్ప‌ట్ల‌తో థియేట‌ర్లు షేక్ అవుతున్నాయి. ఇక అస‌లు విష‌యానికి వస్తే.. బాల‌య్య‌, చిరంజీవి ఇద్ద‌రూ మంచి ఫ్రెండ్స్. ఒక‌రి సినిమా స‌క్స‌స్ అయితే.. మ‌రొక‌రు కంగ్రాట్స్ చెప్ప‌డం.. సెల‌బ్రేట్ చేసుకోవ‌డం చేస్తుంటారు. అఖండ సినిమాకి బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ రావ‌డంతో బాల‌య్య‌కు మెగాస్టార్ ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పార‌ట‌. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నువ్వా..? నేనా..? అన్న‌ట్టుగా పోటీప‌డే చిరు, బాల‌య్య ఇంత ప్రెండ్లీగా ఉండ‌డం ఎంతైనా అభినంద‌నీయం.

Advertisement