ఈ మధ్య చాలామంది దర్శక నిర్మాతలు సడెన్ సర్ ప్రైజ్ లు ఎక్కువగా ఇస్తున్నారు. పైగా చెప్పిన టైమ్ కు అన్నీ విడుదల చేస్తున్నారు. ఒక గంట లేట్, రెండు గంటలు లేట్ అంటూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టకుండా.. ఇంకా చెబితే అసలు చెప్పుకుండానే అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో ఎవరూ ఊహించని విధంగా మెగాస్టార్ లేటెస్ట్ మూవీ టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం గాడ్ ఫాదర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న మెగాస్టార్ మరోవైపు బాబీ దర్శకత్వంలో చేస్తోన్న సినిమాకు సంబంధించిన షూటింగ్స్ లోనూ పార్టిసిపేట్ చేస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతోన్న ఈ మూవీ టైటిల్ వాల్తేర్ వీరయ్య. ఆ మధ్య ఈ టైటిల్ మారుస్తారు అనే టాక్ వినిపించింది. బట్ ఆ టైటిల్ తోనే వస్తున్నారు. మెగాస్టార్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఓ కీలక పాత్రకు మాస్ మహరాజ్ ను తీసుకున్నారు. రవితేజ కెరీర్ ప్రారంభ దశలో చిరంజీవితో అన్నయ్య అనే సినిమాలో తమ్ముడుగా నటించాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.

మధ్యలో శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్ లో శ్రీకాంత్ చేసిన పాత్రలో మొదట అనుకుంది రవితేజనే. అప్పుడు అతను హీరోగా ఓ రేంజ్ లో బిజీగా ఉన్నాడు. అందుకే కుదరలేదు. ఇప్పుడు ఇలా కుదిరిందన్నమాట. కొన్నాళ్ల క్రితమే రవితేజ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు కూడా. రవితేజ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని వేరే చెప్పక్కర్లేదేమో.వైజాగ్ పోర్ట్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న వాల్తేర్ వీరయ్య టీజర్ ను విడుదల చేయబోతున్నారు. యస్ ఇది చాలామంది ఊహించలేదు. దీపావళికే టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు. పైగా టీజర్ లో మెగాస్టార్ తో పాటు టీజర్ లో రవితేజ కూడా ఉంటాడట. మాస్ కు మాంచి కిక్ ఇచ్చేలా టీజర్ ను కట్ చేశారట. లేటెస్ట్ గా మెగాస్టార్ తో పాటు మాస్ మహరాజ్ కూడా టీజర్ కోసం డబ్బింగ్ చెప్పడం పూర్తయిందంటున్నారు. సో.. ఈ దీపావళికి పటాస్ లతో పాటు వాల్తేర్ వీరయ్య టీజర్ కూడా మెగామాస్ అంటూ మోత మోగించబోతోందన్నమాట.

, , ,