మెగా హీరో వరుణ్‌తేజ్‌ సినిమా ఆగిపోలేదని స్ట్రాంగ్‌ ఇండికేషన్స్ వచ్చేశాయి. అన్నీ అనుకున్న ప్రకారమే జరిగితే వచ్చే నెల నుంచే సినిమా పట్టాలెక్కుతుందని అంటున్నారు డైరక్టర్‌. మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ హీరోగా ప్రవీణ్‌ సత్తారు డైరక్షన్‌లో ఓ సినిమా ఉంటుందని గతంలో అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ప్రవీణ్‌సత్తార్‌ గోస్ట్ సినిమాతో బిజీగా ఉన్నారు. అంతలోనే వరుణ్‌తేజ్‌ 13వ సినిమా అంటూ పైలట్‌ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్‌ వచ్చేసింది. ఈ వార్తలన్నీ గమనిస్తున్న వాళ్లు అసలు వరుణ్‌తోప్రవీణ్‌సత్తార్‌ సినిమా ఉంటుందా? లేదా? అనే డైలమాలో పడ్డారు.

అయితే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు ప్రవీణ్‌ సత్తార్‌. అక్టోబర్‌ 5న నాగార్జున నటించిన గోస్ట్ సినిమా విడుదలవుతుంది. ఆ తర్వాత ఓ ఐదు రోజుల పాటు గోస్ట్ ప్రమోషన్లలో పాల్గొంటారు ప్రవీణ్‌ సత్తార్‌. అక్టోబర్‌ 10 నుంచి వరుణ్‌తేజ్‌ కొత్త సినిమా షూటింగ్‌ మొదలుపెట్టేస్తారు. ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ సినిమాగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఇప్పుడే ఈ సినిమా గురించి చెబితే జనాల్లో ఆసక్తి పోతుందన్నది మేకర్‌ మాట. అయినా ఆరడుగుల వరుణ్‌కి తగ్గ యాక్షన్‌ కథను ప్రిపేర్‌ చేశారని టాక్‌. ఆల్రెడీ ఎఫ్‌2, ఎఫ్‌3తో హిట్లందుకున్న వరుణ్‌కి గని పెద్ద డిజాస్టర్‌ అయింది. ఇప్పుడు ప్రవీణ్‌ సత్తార్‌ సినిమా హిట్‌ క్రూషియల్‌గా మారింది. ప్రవీణ్‌ సత్తార్‌ సినిమాను త్వరగా పూర్తిచేసి సర్జికల్‌ స్ట్రైక్‌ సబ్జెక్టుతో తెరకెక్కే సినిమా సెట్స్ లోకి షిఫ్ట్ అవుతారు వరుణ్‌తేజ్‌.

, , ,