Advertisement
గ్రాండ్ గా అఖండ సక్సెస్ మీట్
Latest Movies Tollywood

గ్రాండ్ గా అఖండ సక్సెస్ మీట్

Advertisement

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను.. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రూపొందిన‌
హ్యాట్రిక్ మూవీ అఖండ‌. ఈ సినిమా ఊహించ‌ని విధంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవ‌ర్ సీస్ లో సైతం అఖండ అద్భుత‌మైన విజ‌యం విజ‌యం సాధించింది. 50 రోజుల దిశ‌గా స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతుండ‌డంతో ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని అఖండ విజ‌యోత్స‌వ స‌భ‌ను హైద‌రాబాద్ లో ఈరోజు నిర్వ‌హించారు.

ఈ వేడుక‌లో బాల‌కృష్ణ మాట్లాడుతూ.. అఖండ చిత్రాన్ని డిసెంబ‌ర్ 2న విడుద‌ల చేశాం. అస‌లు సీజ‌నే కాదు.. పైగా క‌రోనా మ‌హ‌మ్మారి పూర్తిగా పోలేదు. ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కి వ‌స్తారా..? సినిమా చూస్తారా..? అనే భ‌యాలు ఉన్న‌ప్ప‌టికీ మా నిర్మాత ధైర్యంగా రిలీజ్ చేశారు. ప్రేక్ష‌క దేవుళ్లు అభిమానించారు.. ఆద‌రించారు. అఖండ సినిమాతోనే సంక్రాంతి మొద‌లైంది. తిరునాళ్ల‌కి వ‌చ్చిన‌ట్టుగా అఖండ సినిమాకి వ‌చ్చారు.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అఖండ గురించి మాట్లాడుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే… పాన్ వ‌ర‌ల్డ్ మూవీ అయ్యింది. అఖండ విజ‌యాన్ని ఆ భ‌గ‌వంత‌డు ఇచ్చాడు. మ‌న ప‌నే మ‌న దేవుడు. ప్ర‌తి మ‌నిషిలోను దేవుడు ఉన్నాడు. నాకు బోయ‌పాటి పెద్ద‌గా క‌థ చెప్ప‌డు. క‌థ చెప్ప‌డానికి వ‌చ్చినా నేను త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తాను. ఎందుకంటే.. ఆయ‌న మీద నాకు అంత న‌మ్మ‌కం. తెలుగు చిత్ర పరిశ్ర‌మే కాదు.. యావ‌త్ భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుడు బోయపాటి అన్నారు.

Advertisement