రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న సినిమా “మాటే మంత్రము”. ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు. కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథను అందించగా…అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్నదీ సినిమా.బుధవారం హీరోయిన్ మేఘా ఆకాష్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. రెబల్ కావ్యగా మేఘా ఆకాష్ లుక్ సరికొత్తగా ఉంది.

హాకీ స్టిక్ పట్టుకుని స్మోక్ చేస్తున్న కావ్య డ్రీమ్స్, హాబీస్, ఎమోషన్స్ అన్నీ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో చూపించారు. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకుందీ సినిమా. రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ…”ఇవాళ మా హీరోయిన్ మేఘా ఆకాష్ పుట్టినరోజు. బర్త్ డే విశెస్ చెబుతూ ఆమె నటించిన కావ్య క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. కావ్య ఒక రెబల్ గర్ల్. మేఘా ఆకాష్ ను ఇప్పటిదాకా చూడని కొత్త క్యారెక్టర్ లో చూస్తారు. గోవా బ్యాక్ డ్రాప్ లో జరిగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రెండు పాటలు మినహా మొత్తం షూటింగ్ పూర్తి చేశాం” అన్నారు.

, , , , , , , , , ,