మాస్ మహరాజ్ గా ఆడియన్స్ లో ముద్ర వేయించుకున్నాడు రవితేజ. తనదైన శైలిలో మాస్ ఆడయన్స్ ను అట్రాక్ట్ చేసి.. తనకంటూ తిరుగులేని మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే కొన్నాళ్లుగా అతనికి విజయాలు స్థిరంగా ఉండటం లేదు. ఒక్క హిట్టు నాలుగైదు ఫట్ లు అన్నట్టుగా సాగుతోంది. క్రాక్ తర్వాత వచ్చిన ఖిలాడీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అనిపించుకుంది. ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాతో వస్తున్నాడు. శరత్ మండవ ఈ మూవీతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. రవితేజ సరసన దివ్యాంశా కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ తో పాటు కొన్ని పాటలు కూడా ఆకట్టుకున్న ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా ఓ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదలద చేశారు.

‘‘నేనేనా నేనేనా నిన్నా మొన్నా ఉన్నది మరి నేనేనా.. నిన్నేనా నిన్నేనా ఇన్నాళ్లుగా చూస్తున్నది నిన్నేనా ’’.. అంటూ సాగే ఈ గీతాన్ని కళ్యాణ్ చక్రవర్తి రాశాడు. హరిప్రియ, నకుల్ అభయంకర్ పాడారు. సొట్టల బుగ్గల్లో రాసుకుపోయావే నన్నే నీ పేరా.. అంటూ కొన్ని మంచి పదాలు కూడా కనిపించిన ఈ గీతంలో రవితేజ ఇంతకు ముందు లేని విధంగా కాస్త ఎక్కువ రొమాన్స్ కోరుకుంటున్నాడని అర్థం అవుతోంది. అంటే పాటలో ఉన్న పదాలను బట్టి కాదు.. మాంటేజ్ లో కనిపించిన విజువల్స్ ను బట్టి చూస్తే ఇది అర్థమౌతుంది.
కొన్నాళ్లుగా రవితేజ కొత్త హీరోయిన్లకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. పైగా కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా కాస్త రొమాన్స్ డోస్ కూడా పెంచాడు. ఖిలాడీలో ఏకంగా లిప్ లాక్ లు కూడా పెట్టేసి ఆశ్చర్యపరిచిన మాస్ రాజా ఈ పాటలో కూడా చెంపల ముద్దులతో హీరోయిన్ ను తడిపేస్తున్నాడు. మరి లిరికల్ సాంగ్ లోనే ఇలా ఉంటే పూర్తి మాంటేజ్ లో మనోడు మరింత రెచ్చిపోయుంటాడని అర్థం కావడం లేదు.

ఇక శామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ గీతం మరీ కొత్తగా లేకపోయినా.. ఇన్స్ స్ట్రుమెంటేషన్ బావుంది. ఫిమేల్ వాయిస్ లో అక్షరాలు బాగా వినిపించినా.. మేల్ వాయిస్ లో వినిపించిన పదాలేవీ అర్థం కావడం లేదు. మొత్తంగా శ్రీ లక్ష్మి వెంకటేవ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన రామారావు ఆన్ డ్యూటీ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఖిలాడీ పోయింది. మరి రామారావు అయినా రవితేజను ఆదుకుంటాడా లేదా అనేది చూడాలి.

, , , , , , , , , , , , , , ,