Advertisement
మేజర్ ట్రైలర్ టాక్ – ఎక్స్ ల్లెంట్ విత్ ఎమోషన్స్ అండ్ యాక్షన్
Latest Movies Reviews Tollywood

మేజర్ ట్రైలర్ టాక్ – ఎక్స్ ల్లెంట్ విత్ ఎమోషన్స్ అండ్ యాక్షన్

Advertisement

మేజర్.. అనౌన్స్ అయిన దగ్గర్నుంచీ అందరి అటెన్షన్ ను గ్రాబ్ చేసిన సినిమా. అందుకు కారణం.. 26/11 అటాక్స్ లో ఎంతోమంది ప్రాణాలు కాపాడి.. అవసరమైతే నా ప్రాణాలను ఇస్తాను కానీ.. దేశాన్ని కాదు అని నినదించి మరణించిన వీర జవాన్ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ లైఫ్ స్టోరీ ఆధారంగా వస్తోన్న చిత్రం కావడం ఒకటైతే.. ఇలాంటి సినిమాలతో అద్భుతమైన విజయాలు సాధిస్తోన్న మనతెలుగు స్టార్ అడవి శేష్ ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు ఈ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించడం వంటి వన్నీ కలిసి మేజర్ సినిమాను మొదటి నుంచీ ఆడియన్స్ మైండ్ లోనే ఉండేలా చేశాయి. ఇక లేటెస్ట్ గా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఈ మూవీ ట్రైలర్ ను మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు.

ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ చెబుతోన్న మాట ఒక్కటే.. ఎక్స్ ల్లెంట్ అని. నిజంగానే ఇలాంటి ట్రైలర్ ను కట్ చేయడం కత్తిమీద సాము లాంటిది. కానీ అటు పేరెంట్స్ ఎమోషన్స్ ను, ఇటు సందీప్ లోని దేశభక్తితో పాటు ఆ రోజు జరిగిన అటాక్స్ ను కళ్లకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సస్ అయ్యారు. మామూలుగా ఆర్మీ నేపథ్యంలో సినిమా అంటే అందులో దేశభక్తికి సంబంధించి డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలుస్తాయి. కానీ అవేవీ లేకుండానే ఓ అద్భుతమైన సినిమాను చూడబోతున్నాం అనే ఫీలింగ్ కలిగించేలా ఈ ట్రైలర్ కనిపిస్తోంది. సందీప్ ఉన్నికృష్ణన్ బయోగ్రఫీ అని కాకుండా చిన్నతనం నుంచీ ఆయన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్స్ ను రికార్డ్ చేసినట్టుగా కనిపిస్తోంది. అందులో 26/11 అటాక్స్ ప్రధానంగా ఉంటుందనుకోవచ్చు. ఓ రకంగా ఇదంతా సెకండ్ హాఫ్ కు ముందు నుంచి మొదలయ్యే ఎఫిసోడ అనుకోవచ్చు. ఒక పార్ట్ అంతా అదే ఎపిసోడ్ ను రన్ చేయడం ఆషామాషీ విషయం కాదు. కానీ స్క్రీన్ ప్లే విషయంలో శేష్ మొదటి నుంచి తన దర్శకుడితో కూర్చుని చాలా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాడు కదా.. అందువల్ల అందులో డౌట్సేం ఉండక్కర్లేదు.

ఇక శేష్ కు జంటగా సాయీ మంజ్రేకర్ నటించగా.. ఆ రోజు అటాక్స్ లో అదే హోటెల్ లో ఉన్న లేడీగా శోభిత ధూళిపాళ్ల నటించింది. సందీప్ పేరెంట్స్ గా ప్రకాష్ రాజ్, రేవతి అద్భుత నటన కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రైలర్ లో ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్స్ చూస్తే హృదయం బరువెక్కిపోతుంది. సో సినిమాలో ఈ ఎపిసోడ్ మరో హైలెట్ అవుతుందనుకోవచ్చు. మొత్తంగా అడవి శేష్ ఆలస్యమైనా మరో అద్భుతమైన సినిమాతో వస్తున్నాడని అర్థమౌతోంది.

Advertisement

Post Comment