ఎంత సోష‌ల్ మీడియా స్ట్రాంగ్ అయినా, స్టార్‌ల‌కు సంబంధించిన ప్ర‌తిదీ ఫ్యాన్స్ కి ఎగ్జ‌యిట్‌ క‌లిగిస్తూనే ఉంటుంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన మ‌హేష్ పిక్ అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్‌. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం రెస్ట్ అండ్ రీచార్జ్ అంటూ మ‌హేష్ ఓ పిక్ రిలీజ్ చేస్తే, వెంట‌నే వైర‌ల్ చేసేశారు ఫ్యాన్స్. నెట్టింట్లో ట్రెండింగ్‌లోకి వ‌చ్చేసింది ఈ పిక్‌.ఇప్పుడు త్రివిక్ర‌మ్ సినిమాలో న‌టిస్తున్నారు మ‌హేష్‌. ఆ సినిమా కోసమే కాస్త జుట్టు పెంచి, స‌న్న‌టి గ‌డ్డం పెంచి, కొత్త స్టైల్‌లో మీసాల‌తో క‌నిపిస్తున్నారు. ఈ సినిమా కోసం మ‌హేష్ వెయిట్ కూడా త‌గ్గిన‌ట్టు క‌నిపిస్తున్నారు.

లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఆ పిక్‌ని చూస్తే మ‌హేష్ వెయిట్ త‌గ్గిన సంగ‌తి బాగా అర్థ‌మైపోతుంది.కాక‌పోతే, త్రివిక్ర‌మ్ సినిమా మొత్తం మ‌హేష్‌ ఇదే లుక్‌లో క‌నిపిస్తారా? లేకుంటే ఇప్పుడు తీస్తున్న షెడ్యూల్లో ఇలా క‌నిపించి, త‌ర్వాత ఇంకో లుక్‌లోకి మారుతారా? అనేది తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతానికైతే మ‌హేష్ పోస్ట్ చేసిన పిక్‌, త్రివిక్ర‌మ్ క‌థ‌కి సిమిల‌ర్‌గా ఉన్న లుక్కే.మ‌హేష్ పిక్ పోస్ట్ చేయ‌గానే సింప్లీ ల‌వ్ అని రిప్లై ఇచ్చారు ఆయ‌న స‌తీమ‌ణి న‌మ్ర‌త‌. రామోజీఫిల్మ్ సిటీలో వేసిన సెట్లో సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. ఈ సినిమాకు ఆరంభం అనే పేరు ప్ర‌చారంలో ఉంది. అత‌డు, ఖ‌లేజా త‌ర్వాత ఇప్పుడు త్రివిక్ర‌మ్ – మ‌హేష్ క‌లిసి చేస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది.ఆల్రెడీ స‌రిలేరు నీకెవ్వ‌రు, స‌ర్కారువారి పాట సినిమాల స‌క్సెస్ మీదున్నారు మ‌హేష్‌.

, , , , , ,