ad

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తున్నారు. మ‌రో వైపు నిర్మాత‌గా సినిమాలు నిర్మిస్తున్నారు. ఇలా హీరోగా, ప్రొడ్యూస‌ర్ గా ఫుల్ బిజీగా ఉన్న‌ప్ప‌టికీ… మ‌రో వైపు సైలెంట్ గా సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ ఎంద‌ర్నో ఆదుకుంటున్నారు. ఇంకెంద‌రికో ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ఆయ‌న సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్న విష‌యం చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు.

ఇంత‌కీ మ‌హేష్ ఏం చేస్తున్నారంటే…. ఎందరో చిన్నారులకు ఊపిరి పోసి వారి పాలిట దేవుడుగా నిలుస్తున్నాడు. ఇప్పటి వరకు ఎందరో చిన్నారులు హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న వారికి తన ఆదాయం నుంచి ఆపరేషన్ లు చేయించి ప్రాణాలు నిలిపారు. తాజాగా కాపాడిన ప్రాణంతో ఈ లెక్క ఒక వెయ్యి యాభై ఎనిమిది దగ్గరకి వచ్చింది. ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్రత తన ఇన్స్టా గ్రామ్ ద్వారా తెలియజేశారు. దీనితో మహేష్ చేస్తున్న సేవాకార్య‌క్ర‌మాల గురించి తెలుసుకుని ఆయ‌న అభిమానులు ఎంతో ఆనందంగా… గర్వంగా ఫీల‌వుతున్నారు.

ఇక మ‌హేష్ సినిమాల విష‌యానికి వ‌స్తే… ప్ర‌స్తుతం మ‌హేష్ చేస్తున్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌ర్కారు వారి పాట‌. ప‌ర‌శురామ్ డైరెక్ష‌న్ లో రూపొందుతోన్న స‌ర్కారు వారి పాట షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. స‌మ్మ‌ర్ లో ఈ భారీ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

, , , , , , , , , , ,