సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ కాంబినేషన్లో రూపొందిన అతడు, ఖలేజా చిత్రాలు రూపొందడం.. ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడం తెలిసిందే. దీంతో వీరిద్దరూ కలిసి మరో సినిమా చేస్తే చూడాలనుకున్నారు సినీ అభిమానులు. అయితే.. ఎట్టకేలకు ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టుగా ప్రకటించింది.
అయితే.. ఈ సినిమాని అనౌన్స్ చేసి చాలా రోజులు అయ్యింది కానీ.. ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. జవనరిలో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది అనుకుంటే… మహేష్ బాబు సర్జరీకి వెళ్లబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ మేటర్ ఏంటంటే.. మహేష్ బాబుకు సుదీర్ఘ కాలంగా మోకాలి నొప్పితో బాధ పడుతున్నాడట. ఈమధ్య ఆ నొప్పి ఎక్కువ అవ్వడంతో ఆపరేషన్ తప్పనిసరి అని డాక్టర్లు చెప్పారట. అందుకనే అమెరికాలో ఆపరేషన్ చేయించుకునేందుకు మహేష్ బాబు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం.
సర్జరీ అనంతరం కనీసం రెండు నుండి మూడు నెలల పాటు పూర్తి విశ్రాంతిని తీసుకోవాల్సి ఉంటుందట. అందుచేత త్రివిక్రమ్ తో మహేష్ చేయనున్న మూవీ షూటింగ్ మరింత ఆలస్యం అయ్యేలా ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన మార్చి లేదా ఏప్రిల్ లో మహేష్ బాబు.. త్రివిక్రమ్ కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.