సూపర్ స్టార్ మహేష్‌ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ముందు నుంచీ ఈ నెల మొదటి వారంలోనే షూట్ స్టార్ట్ అవుతుందని చెబుతూ వచ్చారు. చెప్పినట్టుగానే ఈ సోమవారం నుంచి ఈ మోస్ట్ అవెయిటెడ్ కాంబోలో మూవీ మొదలైంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీని హారిక హాసిన బ్యానర్ నిర్మిస్తోంది. 12యేళ్ల క్రితం ఈ కాంబినేషన్ లో ఖలేజా అనే సినిమా వచ్చింది. అప్పట్లో ఆ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు కానీ.. మహేష్‌ లోని కామెడీ టైమింగ్ కు అద్భుతంగా చూపించిన సినిమాగా ఇప్పుడు చూస్తున్నవారు చెప్పుకుంటారు. అయితే ఈ సినిమాకు ముందే మహేష్‌ పోకిరి, బిజినెస్ మేన్ వంటి మాస్ మూవీస్ చేసి ఉండటంతో అప్పటి జనానికి అంతగా కనెక్ట్ కాలేదు. అలాగే త్రివిక్రమ్ దర్శకుడుగా రెండో సినిమా మహేష్‌ తోనే చేశాడు.

అది అతడు సినిమా. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించినంత పెద్ద హిట్ కాదు. బట్.. ఇప్పుడు టివిల్లో ఎప్పుడు వచ్చినా ఆడియన్స్ అలా చూస్తుండిపోతుంటారు.ఇక 12యేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ఇప్పుడు కాలం మారింది. ఆడియన్స్ టేస్ట్ లో మార్పులు వచ్చాయి. అందుకు అనుగుణంగా మన మేకర్స్ కూడా మారారు. త్రివిక్రమ్ అల వైకుంఠపురములో అంటూ ఎంటైర్ కంట్రీని ఆకట్టుకున్న తర్వాత చేస్తోన్న సినిమా ఇది. ఇటు మహేష్‌ వరుస విజయాలతో జోష్ లో ఉన్నాడు. అందుకే ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పుడే అంతా ఆసక్తి చూశారు. ఇప్పుడు అంచనాలూ పెరిగాయి. వాటిని అందుకోవడంతో పాటు చిత్రాన్ని ప్యాన్ ఇండియన్స్ కు కూడా నచ్చేలా రూపొందిస్తున్నారని టాక్. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఎలా ఉంటుందో కానీ.. షూటింగ్ మాత్రం చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేసి వచ్చే యేడాది ఏప్రిల్ 28న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

, , , , , ,