ad

మహేష్‌ బాబు కొన్నాళ్లుగా వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. కొన్ని యావరేజ్ అనిపించుకున్నా.. కమర్షియల్ గా ఫర్వాలేదనిపిస్తూ ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా వచ్చిన సర్కారువారి పాట కూడా కంటెంట్ వీక్ గా ఉన్నా కలెక్షన్స్ ఆకట్టుకున్నాయి. ఈ కారణంగానే సినిమా సినిమాకు మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకోవడం లేదు. ప్రత్యేకంగా ఫలానా సబ్జెక్టే కావాలని పట్టుపట్టడం లేదు. తన వద్దకు వచ్చిన కథ నచ్చితే కమిట్ అయిపోతున్నాడు. అందుకే 12యేళ్ల తర్వాత త్రివిక్రమ్ తో సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ ఇద్దరి కాంబోలో గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. కానీ అవి అప్పట్లో పెద్దగా ఆకట్టుకోలేదు.అల వైకుంఠపురములో అంటూ ఇండస్ట్రీ హిట్ కొట్టినా నెక్ట్స్ మూవీకి చాలా గ్యాప్ తీసుకున్నాడు త్రివిక్రమ్. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలి. అనుకోని కారణాలతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.అప్పుడే మహేష్‌ తో మూవీ ఓకే అయింది. కానీ కథ లేదు. ఆ కథ కోసమే ఇన్నాళ్లూ వెయిట్ చేశారు. ఇటు మహేష్‌ ఆ టైమ్ లో సర్కారువారి పాట ఫినిష్‌ చేశాడు. అయితే నిన్నా మొన్నటి వరకూ కూడా ఈ ఇద్దరి కాంబోపై ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గ కథ ఇంకా సెట్ కాలేదు. అందుకే ఈ ప్రాజెక్ట్ ఆగిపోవచ్చు అంటూ రకరకాల రూమర్స్ వచ్చాయి. ఆ రూమర్స్ కు చెక్ పెడుతూ అఫీషియల్ గా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది.
త్రివిక్రమ్ సినిమా అంటే ఖచ్చితంగా హారిక హాసిని బ్యానర్లోనే ఉంటుంది కదా..? ఆ బ్యానర్ నుంచే ఈ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తమన్ మ్యూజిక్ స్టార్ట్ చేశాడు. హీరోయిన్ గా పూజా హెగ్డే అని గతంలోనే ప్రకటించారు. ఇక మరో పాత్రలో సంయుక్త మీనన్ నటించే అవకాశం ఉంది. మహేష్‌ తో పాటు ఓ కీలక పాత్రలో ఉపేంద్ర కూడా నటిస్తాడు అంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ పూర్తి కాగానే ఈ ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళుతుందీ చిత్రం. అంటే కేవలం నెల రోజుల్లోనే సెట్స్ పైకి వెళుతుంది. సినిమాను వచ్చే సమ్మర్ లో విడుదల చేస్తారు. సో.. వీరికి సంక్రాంతి ఒత్తిడి ఏం లేదు. ఈ సారి ఎలాంటి కథతో వస్తున్నారు అనేది ఇంకా తెలియదు కానీ.. మొత్తంగా క్రేజీ కాంబినేషన్ నుంచి కీలకమైన అప్డేట్ వచ్చేసింది. ఇక ఫ్యాన్స్ అంతా సమ్మర్ కోసం చూసుకోవాల్సిందే.

, , , , , ,