ఓవ‌ర్ నైట్ వ‌చ్చే ఫేమ్ ను నిల‌బెట్టుకోవ‌డం అనుకున్నంత సులువు కాదు. ఒక్కోసారి ఆ ఓవ‌ర్ నైట్ ఫేమ్ నైట్ కి నైటే అవుట్ అయిపోయినా ఆశ్చ‌ర్యం లేదు. అలాంటివి సినిమా ప‌రిశ్ర‌మలో ఎక్కువ‌గా జ‌రుగుతుంటాయి. ఒక్కో ఫ్రైడే ఒక్కొక్క‌రి లైఫ్ డిసైడ్ అయిపోతుంటుంది. అలా ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో రాత్రికి రాత్రే ఫేమ‌స్ డైరెక్ట‌ర్ అయిపోయాడు అజ‌య్ భూప‌తి.

రామ్ గోపాల్ వ‌ర్మ శిష్యుడు అనే ట్యాగ్ లైన్ కూడా ఈ చిత్రంతో పాటు అత‌నికీ ప్ల‌స్ అయింది. అదే టైమ్ లో యాటిట్యూడ్ కూడా అలాగే క‌నిపించింది. దీంతో మ‌రో పాథ్ బ్రేకింగ్ డైరెక్ట‌ర్ వ‌చ్చాడు అనుకున్నారు. ఆ త‌ర్వాత అత‌ను త‌యారు చేసిన మ‌ల్టీస్టార‌ర్ స్టోరీకి హీరోలే దొర‌క‌లేదు. అదేంటీ..

అంత పెద్ద హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ‌ను ఇంత‌మంది హీరోలు రిజెక్ట్ చేస్తున్నారు.. వీళ్లంతా ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ ను మిస్ చేసుకుంటున్నారా అనుకున్నారు. చివ‌రికి శ‌ర్వానంద్, సిద్ధార్థ్ ల‌తో చేసిన మ‌హా స‌ముద్ర మ‌నోడిని నిండా ముంచింది. మొద‌టి ఆట‌కే డిజాస్ట‌ర్ గా డిక్లేర్ చేశారు ఆడియ‌న్స్.

అంతే.. అత‌ని రేంజ్ అదే నిమిషం ప‌డిపోయింది. రెండు కోట్ల‌తో తీసిన ఆర్ఎక్స్100 మూవీ 15కోట్లుకు పైగా కలెక్ట్ చేస్తే.. దానికి డ‌బుల్ లాస్ మ‌హా స‌ముద్రం తెచ్చింది. దీంతో ఇక మ‌నోడి ఫోన్ ను ఏ నిర్మాతా ఎత్త‌లేదు. దీనికి తోడు ఈ మ‌హాస‌ముద్రం పై ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ పెట్టుకుని వ‌చ్చిన నిర్మాత‌ల‌ను వ‌దిలేసుకున్నాడు అని కూడా చెప్పుకున్నారు. సో అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత‌లు కూడా లేక అప్ప‌టి నుంచి ఖాళీగానే ఉన్నాడు. ఇన్నాళ్ల త‌ర్వాత ఫైన‌ల్ గా అత‌నికి ఓ నిర్మాత దొరికాడు.


మూడో సినిమాను క‌మ‌ర్షియ‌ల్ జోన్ లో కాకుండా మ‌ళ్లీ ప్ర‌యోగ‌మే చేస్తున్నాడు. ఈ సారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాతో వ‌స్తున్నాడ‌ట‌. పైగా ఇది రామ్ గోపాల్ వ‌ర్మ ల‌డకీ టైప్ లో మార్ష‌ల్ ఆర్ట్స్ తెలిసిన అమ్మాయి క‌థ అంటున్నారు. ఆల్రెడీ వ‌ర్మ డిజాస్ట‌ర‌స్ రిజ‌ల్ట్ చూశాడు. మ‌రి అజ‌య్ భూప‌తి సాధిస్తాడా లేదా అనేది చూడాలి.

, , , , , ,