తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగింది. దీనికి తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ ఫంక్షన్ లో మంచు విష్ణు మాట్లాడుతూ… తెలుగు వాళ్లందరం కలిసి సినిమా పరిశ్రమను అభివృద్ది చేయాలి. ఈ వేడుకకు మా అధ్యక్షుడిగా రాలేదు… కేవలం సినిమా పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తిగానే వచ్చానని అన్నారు. అలాగే.. నాకు ప్రాంతీయతత్వం లేదు. తెలుగు వారందరూ కలిసి కట్టుగా ఉండాలి.
తెలుగు వాళ్ల ఆత్మగౌరవం ఎక్కడ తగ్గినా అందరం ఒక్కటవ్వాలి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి పాలసీలతో ఇండస్ట్రీని కాపాడుతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్లం ఎవరిపైనా రాళ్లు విసరకూడదు. సినీ ప్రముఖులు ఇచ్చే స్టేట్ మెంట్ ఏదైనా ఆచితూచి ఇవ్వాలి. ఇండస్ట్రీలో ఉన్నవారు ఇచ్చే స్టేట్ మెంట్స్ అంతిమంగా సినీ పరిశ్రమ పై పడుతుంది. కాబట్టి అందరూ ఐక్యమత్యంగా ఉండి అందరి తరుఫున స్టేట్ మెంట్ ఇవ్వాలన్నారు.
లేదంటే వ్యక్తిగతంగా స్టేట్ మెంట్ ఇస్తున్నామని చెప్పాలని మంచి విష్ణు పిలుపునిచ్చారు. నాకు ఎన్నికల్లో అండగా నిలబడి ఎంతగానో సహకరించారు రామకృష్ణా గౌడ్, గురురాజ్. అందుకే వారి కోసం ఈ కార్యక్రమానికి వచ్చాను. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు. ఈ విధంగా మంచువిష్ణు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.