Advertisement
గీత ర‌చ‌యిత కందికొండ ఇక లేరు.
Latest Movies Tollywood

గీత ర‌చ‌యిత కందికొండ ఇక లేరు.

Advertisement

ప్ర‌ముఖ సినీ గేయ రచయిత కంది కొండ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ రోజు తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ మోతీ న‌గ‌ర్ లోని సాయి శ్రీనివాస్ ట‌వ‌ర్స్ లో క‌న్నుమూశారు. కందికొండకు గత కొన్ని నెలలుగా ట్రీట్‌మెంట్ జరుగుతోంది. గతంలోనే ఈ విషయం తెలుసుకున్న మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తూ సాయం కూడా అందించారు. వైద్యం అందుతున్నా.. ఆయన ఆరోగ్యం మాత్రం క్షిణిస్తూ వ‌చ్చింది. ఈరోజు శనివారం తుది శ్వాస విడిచారు.

కందికొండ స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామం. తాను చదువుకునే రోజుల నుంచే పాటలు రాయడం నేర్చుకున్నాడు. ఆయనకు ఇంటర్ చదివేటప్పుడు చక్రితో పరిచయం ఏర్పడింది. మొదట్లో జానపద గీతాలు రాసిన కందికొండ సినీ సంగీత దర్శకుడైన చక్రి సాన్నిహిత్యంతో సినిమా సాహిత్యం వైపు మొగ్గు చూపాడు. తొలిసారిగా చక్రి సంగీత దర్శకత్వం వహించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలో మళ్లి కూయవే గువ్వా పాట రచనతో సినీ సాహిత్యంలో అడుగుపెట్టారు. దర్శకుడు పూరి జగన్నాథ్ వరుస అవకాశాలతో పాటలు రాసి గేయరచయితగా నిలదొక్కుకున్నాడు. ఇడియ‌ట్, పోకిరి చిత్రాల్లో పాట‌ల‌కు కందికొండ‌కు మంచి పేరు తీసుకువ‌చ్చాయి.పూరి, చ‌క్రి, కందికొండ హిట్ కాంబినేష‌న్ అని చెప్ప‌చ్చు.

కందికొండ సినీరంగంలో అడుగుపెట్టిన నాటి నుండి పన్నెండేళ్ళ సినీ ప్రస్థానంలో 1300ల‌కు పైగా పాటలు వ్రాసారు. తెలంగాణ నేపథ్యంలో ఎన్నో జానపద గీతాలు కూడా రచించారు. ఆయన బతుకమ్మ నేపథ్యంలో రాసిన పాటలు పల్లెపల్లెనా, గడపగడపనా, జనాల నోటన మార్మోగాయి. ఆయన పాటలే కాదు కవిత్వం రాయటంలోనూ దిట్ట. తెలంగాణా యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయటం ఆయన ప్రత్యేకత. ఎంతో భ‌విష్య‌త్ ఉన్న కందికొండ‌ క్యాన్స‌ర్ బారిన‌ప‌డ్డారు. క్యాన‌ర్స్ తో పాటు క‌రోనా వ‌ల‌న ఆరోగ్యం మ‌రింత క్షీణించ‌డం మ‌ర‌ణించారు. కందికొండ మ‌ర‌ణ ప‌ట్ల పలువురు సినీ ప్ర‌ముఖులు విచారం వ్య‌క్తం చేశారు.

Advertisement