మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. సినిమాల‌ను రెగ్యుల‌ర్‌గా ఫాలో అయ్యేవారికి ప్ర‌త్యేకంగా ప‌రిచయం చేయాల్సిన‌టువంటి అవ‌స‌రం లేని పేరు. ఆమె సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టి ద‌శాబ్దానికి పైగానే దాటింది. కానీ ఇప్ప‌టికీ అదే గ్లామ‌ర్‌ను మెయిన్‌టెయిన్ చేస్తూ త‌న‌కు తానే పోటీ.. మ‌రెవ్వ‌రూ లేరు పోటీ అనేస్తుంది మ‌రి. పెర్ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర‌లైనా.. గ్లామ‌ర్ పాత్ర‌లైనా చేయ‌టానికి మ‌న మిల్కీబ్యూటీ సిద్ధం. అయితే అమ్మ‌డు త‌న గ్లామ‌ర్ డోస్ హ‌ద్దుల‌ను చెరిపేయ‌డానికి రెడీ అయ్యింద‌ని వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

అస‌లు విష‌య‌మేమంటే.. ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో వ‌చ్చిన ల‌స్ట్ స్టోరీస్ అనే అంథాల‌జీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అందులో న‌టించిన కియారా అద్వాని, భూమి ఫెడ్నేక‌ర్ నెక్ట్స్ రేంజ్ బోల్డ్ అనేలా న‌టించేసి కుర్ర‌కారు గుండెల్లో కిత‌కిత‌లు పెట్టేశారు. ఇప్పుడు వీరి జాబితాలోకి మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కూడా చేర‌నుంద‌ట‌. త్వ‌ర‌లోనే ల‌స్ట్ స్టోరీస్ 2 ప్రారంభం కానుంది. ఇందులో త‌మ‌న్నా న‌టించ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌న్నా చేసిన గ్లామ‌ర్ రోల్స్ వేరు. ఈ సిరీస్‌లో త‌ను చేస్తే మ‌రో రేంజ్‌లో చేయాల్సి ఉంటుంది. ఇందులో ఆమెతో క‌లిసి విజ‌య్ వ‌ర్మ న‌టించ‌బోతున్నారు. నాని హీరోగా చేసిన ఎంసిఎ సినిమా స‌హా బాలీవుడ్‌లో ప‌లు చిత్రాల‌తో మెప్పించిన విజ‌య్ వ‌ర్మ మ‌న తెలుగువాడే. రీసెంట్‌గానే త‌మ‌న్నా, విజ‌య్ వ‌ర్మ మ‌ధ్య ఫొటో షూట్‌ను కూడా పూర్తి చేసిన‌ట్లు స‌మాచారం.

, , , , , ,