ad

మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన ప్ర‌భాస్..
ప్ర‌భాస్ పెళ్లి ఎప్పుడు..? గ‌త కొంత కాలంగా స‌మాధానం లేని ప్ర‌శ్న ఇది. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ గా ఉన్న ప్ర‌భాస్ పెళ్లి గురించి మ‌రోసారి చ‌ర్చ మొద‌లైంది. రాధేశ్యామ్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మీడియా ముందుకు వ‌చ్చిన ప్ర‌భాస్ పెద్ద‌మ్మ‌ను ప్ర‌భాస్ పెళ్లి గురించి అడిగితే… ఈ సంవ‌త్స‌రంలో ఖ‌చ్చితంగా ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటాడు అని చెప్పారు. అలాగే మ‌రో విష‌యం ఏంటంటే.. త‌ను ప్రేమ వివాహం చేసుకున్నా మాకు ఎలాంటి అభ్యంత‌రం లేదు అని హింట్ ఇచ్చారు.

ఆమె మాట‌ల‌ను బ‌ట్టి ప్ర‌భాస్ ల‌వ్ మ్యారేజ్ చేసుకుంటాడా..? అనే అనుమానాలు వ‌చ్చాయి. ఇప్పుడు ఆ అనుమానాల‌ను నిజం చేస్తూ.. ప్ర‌భాస్.. ల‌వ్ మ్యారేజ్ చేసుకుంటాన‌ని నేష‌న‌ల్ మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో త‌న మ‌న‌సులో మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్టారు. అయితే.. లవ్ మ్యారేజ్ చేసుకుంటాను.. కానీ, అదెప్పుడో చెప్పలేను అన్నారు. ఇక బాహుబలి సినిమా తర్వాత దాదాపు 5000లకు పైగా పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయని తెలిసింది నిజ‌మేనా అని అడుగగా.. అవునని చెప్పిన ప్రభాస్.. ఇదో పెద్ద కన్‌ఫ్యూజన్. ఇలాంటి పరిస్థితి మీకొస్తే ఏం చేస్తారని సరదాగా అన్నారు.

అలాగే, అమ్మ నన్నూ తరుచూ పెళ్లి గురించే అడుగుతున్నారు. నేను కూడా ఆమెకు బాహుబలి తర్వాత దీని గురించి ఆలోచిస్తానని చెప్పాను. ఇప్పుడు ఇంట్లో అదే చర్చలు నడుస్తున్నాయని తెలిపారు. మొత్తానికి తాను చేసుకునేది ల‌వ్ మ్యారేజ్ అని క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడు చేసుకుంటాడో..? ఎవ‌ర్నీ చేసుకుంటాడో.. అనేది మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు. మ‌రి.. ప్ర‌భాస్ మ‌న‌సు దోచుకున్న ఆ ల‌క్కీ గాళ్ ఎవ‌రో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందేనేమో.