విజయ్ దేవకొండ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. పూరి, ఛార్మిల‌తో పాటు క‌ర‌ణ్ జోహార్‌, అజ‌య్ మెహ‌తా, హీరూ మెహ‌తా నిర్మాత‌లు. అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో మాత్రమే విడుదలైనప్పటికీ విజయ్ దేవరకొండ క్రేజ్ యావ‌త్ ఇండియాకి పాకింది. అదే ఊపు ‘లైగర్’ రిలీజ్ ముందు క‌నిపించింది. ఉత్త‌రాదిలో రౌడీ స్టార్‌కి క్రేజ్ చూసి అంద‌రూ షాక‌య్యారు. సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే క్రేజ్‌తోనే జ‌రిగింది. వంద కోట్ల‌కు పైగా థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగిందని.. అలాగే ఓటీటీ హ‌క్కులు కూడా ఫ్యాన్సీ రేటుకే అమ్ముడైన‌ట్లు స‌మాచారం.

మీడియా వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు సినీ నిర్మాత‌ల్లో ఒక‌రైన ఛార్మి ఓటీటీ హ‌క్కుల‌ను ఫ్యాన్సీ రేటుకి అమ్ముడ‌య్యేలా ప్లాన్ చేసి ‘లైగర్’ రిలీజ్ కంటే ముందుగానే హ‌క్కుల‌ను ఇచ్చేశార‌ట‌. ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ సంస్థ అన్ని భాష‌ల్లో అంటే తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా ఓటీటీ హ‌క్కుల కోసం దాదాపు రూ. 65 కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించార‌ట‌.

ఇక సినిమా విష‌యానికి వ‌స్తే.. ‘లైగర్’ సినిమాపై ఉన్న అంచనాల‌ను అందుకోవ‌టంలో విఫ‌ల‌మైంది. సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్‌.. క్రేజ్ కారణంగా ఈ సినిమాకు తొలి రోజున మంచి షేర్ వ‌సూళ్లే వ‌చ్చాయి. కానీ డిజాస్ట‌ర్ టాక్ రావ‌టం అనేది రానున్న రోజుల్లో సినిమా క‌లెక్ష‌న్స్‌పై ప్ర‌భావం చూపుతుంద‌న‌టంలో సందేహం లేదు.

, , , , , , , ,