ad
వైవిధ్యమైన కథలు అనగానే మనకు ఎక్కువగా మళయాల సినిమాలే గుర్తొస్తాయి. కానీ బాలీవుడ్ లోనూ అలాంటి సినిమాలు ఎక్కువగానే వస్తున్నాయి. కాకపోతే అవి చేసేది పెద్ద హీరోలు కాదు కాబట్టి ఎక్కువమందిని రీచ్ అవడం లేదు. ముఖ్యంగా కొన్నాళ్లుగా బాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా దూసుకుపోతోన్న రాజ్ కుమార్ రావుసినిమా అంటే ఖచ్చితంగా మంచి కంటెంట్ గ్యారెంటీ అనే పేరు పడిపోయింది. ఆల్రెడీ బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ కూడా అందుకున్న రాజ్ కుమార్ రావు లేటెస్ట్ మూవీనే ఈ బధాయి దో. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. రాజ్ కుమార్ సరసన భూమీ ఫెడ్నేకర్ హీరోయిన్ గా నటించింది. ఓ వైపు ఎంటర్టైనింగ్ గా ఉంటూనే మరోవైపు ప్రస్తుతం సొసైటీలో ఓ మేజర్ ఇష్యూను ఈ సినిమా డీల్ చేసినట్టుగా ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.
రాజ్ కుమార్ రావు ఓ పోలీస్ ఆఫీసర్. భూమీ ఓ పియిటీ టీచర్. 30యేళ్లు దాటినా తనకు పెళ్లంటే ఇష్టం లేదని తప్పించుకుంటుంది. అలాంటి తనను ఇష్టపడతాడు ఈ పోలీస్. నాలుగేళ్లు పాటు కష్టపడి తనను ఒప్పిస్తాడు. ఈ క్రమంలోనే ఆమె ఓ లెస్బియన్ అన్న విషయం తెలుసుకుంటాడు. ఆ విషయం తనకు తెలుసని.. తన ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చనే హామీతో పెళ్లికి ఒప్పిస్తాడు. భూమితో పాటు ఆమె లెస్బో ఫ్రెండ్ కూడా అదే ఇంట్లో కాపురం ఉంటుంది. ఇక ట్రైలర్ చివర్లో భూమితో రాజ్ కుమార్ ఓ మాట చెబుతాడు. ‘నాకు తెలుసు.. నీకు మగవాళ్లంటే ఇష్టం లేదని.. కానీ కానీ .. నాకు ఇష్టం’అని. అంటే ఇటు రాజ్ కుమార్ రావు కూడా ఓ గే లాంటి వాడే అని చెప్పకనే చెప్పారు. మరి అతని పాత్ర ఎలా ఉంటుందనేది సినిమా చూస్తే కానీ తెలియదు.
మొత్తంగా ప్రస్తుతం సొసైటీలో ఈ ఎల్జీబిటిక్యూ ఫ్రీడమ్ అనే మాట విస్తృతంగా వినిపిస్తోంది. ఈ టైమ్ లో వస్తోన్న బధాయి దో సినిమా ఖచ్చితంగా కొంతమంది ఐ ఓపెనర్ అవుతుంది అనే కమెంట్స్ వస్తున్నాయి. అయితే ఇది డాక్యుమెంటరీలా కాక కంప్లీట్ ఎంటర్టైనర్ లా ఉండబోతోందని ట్రైలర్ చూశాక తెలుస్తోంది. సో.. రాజ్ కుమార్ రావుతో పాటు బాలీవుడ్ నుంచి మరో ‘ఇన్ఫోటైనర్’వస్తోందన్నమాట. ఇక ఈచిత్రం ఫిబ్రవరి 10న థియేటర్స్ లోనే విడుదల కాబోతోందని ట్రైలర్ తో పాటే చెప్పేశారు.

, , , , ,