లెజెండ్‌ అనగానే మనందరికీ నందమూరి అందగాడు బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా గుర్తుకొస్తుంది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో గూస్‌బంప్స్ తెప్పించిన సీన్లు గుర్తుకొస్తాయి. లెజెండ్‌ సినిమాకు తెలుగు హిస్టరీలో ఓ మంచి స్పేస్‌ ఉంది.


అయితే మీరు హెడ్డింగ్‌లో చదివిన లెజెండ్‌, ఈ లెజెండ్‌ ఒక్కటి కాదు. ఇక్కడ ప్రస్తావిస్తున్నది లెజెండ్‌ శరవణన్‌ నటించిన లెజెండ్‌ గురించి. విడుదలకు ముందు హడావిడి చేసిన ఈ సినిమా, రిలీజ్‌ అయ్యాక ఎక్కడ ఆడిందో, ఎక్కడ లేదో కూడా అర్థం కాని పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్ల గురించి రిలీజైన అఫిషియల్‌ టాక్‌ అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఆరు భాషల్లో రిలీజ్‌ అయింది లెజెండ్‌. విడుదలై ఐదు వారాలు దాటినా ఇంకా సక్సెస్‌ఫుల్‌ రన్‌ ఉంది. 45 కోట్లకు పైగా థియేట్రికల్‌ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాకు డిజిటల్‌లోనూ భారీ డిమాండ్‌ ఉంది. ఒన్లీ ఓటీటీ కోసమే 25 కోట్లు ఆఫర్‌ వచ్చిందంటోంది ప్రొడక్షన్‌ హౌస్‌. శాటిలైట్‌ హక్కులకు 20 కోట్లు ఇస్తామని అంటున్నారట.

దీన్నిబట్టి డిజిటల్‌లో ఇంకో 45 కోట్లు వచ్చినట్టే. న్యూ ఫేస్‌కి ఇన్ని కోట్లా? 60 ప్లస్‌ ఖర్చుతో భారీగా తెరకెక్కించామని ప్రీ రిలీజ్‌ ఫంక్షన్లలో స్టేజ్‌ మీద చెప్పుకున్నాడు శరవణన్‌. ఆయనకోసమే హీరోయిన్లందరూ ఈ సినిమాను రకరకాలుగా ప్రమోట్‌ కూడా చేశారు. తమ కష్టాన్ని ప్రజలు గుర్తించారన్నది మేకర్స్ చెబుతున్న మాట. అయితే ఇన్ని కోట్లు ఎప్పుడు? ఎలా కలెక్ట్ చేశాయన్నది మాత్రం అంతుబట్టడం లేదన్నది వ్యూయర్స్ మాట. అయినా అఫిషియల్‌గా వాళ్లే చెప్పేశాక కాదనేది ఏముంది?
ఇంతకీ వాట్‌ నెక్స్ట్ శరవణన్‌ అని అడగడం తప్ప.

, , , , ,