కొందరు దర్శకులు సినిమాల కంటే పాటల మేకింగ్ పై ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారు. మరి కొందరు పాటల బడ్జెట్ తోనే రెండు మూడు సినిమాలు తీసేస్తుంటారు. అలా తన సినిమాల్లో పాటల కోసం భారీ సెట్స్ వేస్తూ అంతే భారీగా నిర్మాతలతో ఖర్చు పెట్టిస్తుంటాడు శంకర్. ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేస్తోన్న శంకర్ ఈ మూవీలో కూడా అలాంటి ఓ కాస్ట్ లీ సాంగ్ కు ప్లాన్ చేశాడు.

ఒక షెడ్యూల్ మొత్తం కేవలం ఒక్క పాట చిత్రీకరణకే కేటాయించడం విశేషం. చరణ్ తో పాటు కమల్ హాసన్ తోనూ భారతీయుడు2 చిత్రాన్ని రూపొందిస్తున్నాడు శంకర్. కమల్ సినిమా ఒక షెడ్యూల్, చరణ్ సినిమాను ఒక షెడ్యూల్ గా ప్లాన్ చేసుకుని వెళుతున్నాడు. ఈ రెండు పడవల పై కాళ్లు వేస్తూ సాగించే వ్యవహారం ఏమంత తేడా కొట్టదు అనేది శంకర్ భావన. ఎందుకంటే రెండిటికీ బౌంబ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది.

సో ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉంటే పెద్ద కష్టమేం కాదు. బట్ ఇది కాస్త రిస్క్ కూడా. రీసెంట్ గా శంకర్ భారతీయుడు2కు సంబంధించిన షెడ్యూల్ ను ముగించాడు. ఇక చరణ్ కోసం ఓ పాటను చిత్రీకరించేందుకు ఈ నెల 20 నుంచి రెడీ అవుతున్నాడు.


ఈ షెడ్యూల్ ఈ నెల 20 నుంచి డిసెంబర్ 2 వరకూ సాగుతుంది. అన్ని రోజుల పాటూ ఓ పాటను మాత్రమే చిత్రీకరించబోతున్నారట. ఈ పాటే సినిమాలో కాస్ట్ లీ సాంగ్ గా ఉండబోతోంది. మరి ఈ సాంగ్ కోసం పెడుతోన్న ఖర్చు ఎంతో తెలుసా..? 15కోట్లు. యస్.. అక్షరాలా 15కోట్లతో ఈ పాటను చిత్రీకరించబోతున్నాడు. నిజానికి ఈ బడ్జెట్ తోనే వచ్చిన కాంతార సినిమా 400 కోట్ల మార్క్ ను టచ్ చేయబోతోంది. మరి ఒక్క పాటకు అంత ఖర్చు అవసరమా అంటే అది శంకర్ సినిమా కాబట్టి అవసరమే అంటారు కొందరు.


ఇక ఈ పాటలో చరణ్ తో పాటు హీరోయిన్ కియారా అద్వానీ కూడా ఉండబోతోంది. ఫస్ట్ టైమ్ శంకర్ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. చరణ్‌, కియారాతో పాటు ఎస్.జే సూర్య, అంజలి, సునిల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర, జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ్ లోనూ విడుదల కాబోతోంది. మామూలుగా సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ భారతీయుడు2 వల్ల ఆలస్యం అవుతోంది. ఓ మోస్ట్ లీ సమ్మర్ లో విడుదల కావొచ్చు.

, , , , , , , , , , , , , , ,