ఈ 16న ప్రసారం కానున్న ‘జీ కుటుంబం అవార్డ్స్ 2022’

హైదరాబాద్, అక్టోబర్ 12, 2022: రోజురోజుకి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న ‘జీ తెలుగు’ ఈ జర్నీలో తమతో పాటు నడిచిన నటులని, డైరెక్టర్లని, రచయితలని, ప్రొడ్యూసర్లని, ఇతర జీ కుటుంబ సభ్యులని ప్రోత్సయించడంలో ఎల్లప్పుడూ ముందుంటుంది. ‘జీ తెలుగు కుటుంబం అవార్డ్స్’ ద్వారా ప్రతి సంవత్సరం అద్భుతమైన ప్రజాదరణ కనబరిచిన జీ కుటుంబ సభ్యులని గౌరవిస్తూ వస్తుంది. ఐతే, ఈసారి కుటుంబం అవార్డ్స్ మునుపెన్నడూ లేనంత గ్రాండ్ గా కాస్త ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచుతూ నిర్వహింపబడింది. వందలాదిగా సినీ మరియు టీవీ ప్రముఖులు తరలివచ్చిన ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో మీ అభిమాన నటులు అవార్డులు గెలుచుకున్నారో లేదో తెలియాలంటే అక్టోబర్ 16న (ఆదివారం) సాయంత్రం 5:30 గంటల వరకు వేచిఉండాల్సిందే! శ్రీముఖి, సుధీర్ మరియు ప్రదీప్ యాంకర్లుగా వ్యవహరించిన ఈ ఈవెంట్ ఉత్తమ కథానాయకుడు, ఉత్తమ భార్య, ఉత్తమ కుటుంబం, ఉత్తమ భర్త వంటి మరెన్నో కేటగిరీల్లో అవార్డ్స్ ను అందజేయనుంది.

హీరోయిన్లు అంజలి, లక్ష్మి రాయ్, జీ అత్తాకోడళ్లు, మరియు సీరియల్ హీరోహీరోయిన్లు చేసిన అద్భుతమైన డాన్స్ ప్రదర్శనలు, జీ సరిగమప గాయకుల మైమరిపించే పెర్ఫార్మన్స్, మరియు డాన్స్ ఇండియా ఇండియా తెలుగు కంటెస్టెంట్స్ యొక్క ఎనర్జిటిక్ స్టెప్స్ ఆకట్టుకోనున్నాయి. అవార్డ్స్ అందుకున్న అనంతరం పలువురు నటీనటులు చేసిన భావోద్వేగభరిత ప్రసంగాలు ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.జీ తెలుగు కుటుంబ సభ్యులతో పాటు, నటులు అంజలి, లక్ష్మి రాయ్, నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి, బాబు మోహన్, సాయి కుమార్, సోహెల్, తేజ సజ్జ, శ్రీనివాస్ రెడ్డి, నిహారిక కొణిదెల, ఎస్తర్, శివ బాలాజీ, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే, దర్శకులు బోయపాటి శ్రీను, మారుతీ, తేజ, మరియు మల్లిడి వసిష్ఠ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

Related Posts