మైఖేల్ తో పాటు రైటర్ పద్మభూషణ్ కూడా వస్తున్నాడు

జనవరిలో సినిమాల రిలీజ్ ల విషయం పూర్తిగా తేలలేదు. కానీ ఫిబ్రవరి మాత్రం హాట్ కేక్ లా ప్యాక్ అవుతుండటం విశేషం. ఈ సంక్రాంతి తర్వాత మూడో వారం నుంచి మళ్లీ చిన్న, మీడియం సినిమాల సందడి మొదలవుతుంది. ఈ రిపబ్లిక్ డే హాలిడేస్ ను టార్గెట్ చేసుకుని సుధీర్ బాబు హంట్, గీత సాక్షిగా, బుట్టబొమ్మ, రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం అనే సినిమాలున్నాయి. ఇక ఆ తర్వాత వారం సందీప్ కిషన్ మైఖేల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశాడు.

అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో 3వ తేదీన మైఖేల్ రిలీజ్ కాబోతోంది. సందీప్ కు ఇది ఫస్ట్ ప్యాన్ ఇండియన్ మూవీ కావడం విశేషం. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమర్, గౌతమ్ మీనన్, అనసూయ వరుణ్ సందేశ్ వంటి డిఫరెంట్ క్యాస్టింగ్ ఉండటం విశేషం. రంజిత్ జయకోడి ఈ చిత్రానికి దర్శకుడు. ఆ మధ్య వచ్చిన ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లిరికల్ సాంగ్ కు సైతం మంచి ఆదరణ వచ్చింది.

ఓ రకంగా ఒక్క హిట్ కోసం యేళ్లుగా ఎదురుచూస్తున్నాడు సందీప్ కిషన్. ఈ మూవీ అతని ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతుందని చాలామంది భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న విడుదల చేస్తున్నాం అని అనౌన్స్ చేశారు. వీళ్లు అనౌన్స్ చేసినప్పుడు మైఖేల్ మాత్రమే లైన్ లో ఉంది. బట్ ఇప్పుడు మైఖేల్ కు పోటీగా మరో రైటర్ వస్తున్నాడు.


షార్ట్ ఫిల్మ్స్ నుంచి బిగ్ స్క్రీన్ వరకూ వచ్చి.. తన టాలెంట్ తో కీలకమైన పాత్రలు చేస్తున్న సుహాస్ ను కలర్ ఫోటో తో హీరోగా మార్చారు. ఆ మూవీకి మంచి ప్రశంసలు వచ్చాయి. బేసిక్ గా మంచి నటుడు కావడంతో సుహాస్ కు హీరోగా మరిన్ని అవకాశాలు వచ్చాయి. అలా తను హీరోగా నటించిన మరో సినిమా రైటర్ పద్మభూషణ్. సుహాస్ కు జోడీగా టీనా శిల్పరాజ్ నటించింది. రోహిణి, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని కూడా ఫిబ్రవరి 3నే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం సందీప్ ఫామ్ లో లేడు కాబట్టి.. ఖచ్చితంగా సుహాస్ తో పోటీ ఉంటుంది. కాకపోతే ప్రమోషన్స్ లో వైవిధ్యం కనిపిస్తే ఏమైనా తేడాలుంటే అవకాశం ఉంటుంది.

Related Posts