
ఎనర్జిటిక్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నా.. ఆ ఎనర్జీని బాక్సాఫీస్ కు కంటిన్యూస్ గా చూపడంలో ఎప్పుడూ ఫెయిలయ్యే స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni). ఆ మధ్య పూరీ జగన్నాథ్(Puri Jagannath) డైరెక్షన్ లో చేసిన ఇస్మార్ట్ శంకర్(Ismart Shankar) తో కెరీర్ బెస్ట్ హిట్అందుకున్నాడు.

బట్ ఆ తర్వాత చేసిన రెడ్(Red), వారియర్(The Warrior) రెండూ పోయాయి. ప్రస్తుతం బోయపాటి శ్రీను(Boyapati Srinu) డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. మరి బోయపాటి రేంజ్ మాస్ కు.. చాక్లెట్ బాయ్ లా ఉండే రామ్ కు ఎలా సెట్ అవుతుందా అనుకున్నవారికి షాక్ ఇస్తూ ఈ సినిమా నుంచి గతంలోనే ఒక లుక్ ను విడుదల చేశారు. బట్ దానికంటే లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పిక్ షాకింగ్ గా ఉంది.

మరి ఇప్పుడు పోస్టర్ విడుదల చేయడానికి రీజన్ ఏంటీ అంటే.. ఈ నెల 15న రామ్ బర్త్ డే సందర్భంగా ఉదయం 11.25 గంటలకు ఈ మూవీ టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఆ విషయం అనౌన్స్ చేస్తూ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ లుక్ లో రామ్ ను చూస్తే చాక్లెట్ బాయ్ లా లేడు. ఒంగోలు గిత్తలా కనిపిస్తున్నాడు. అతని వెనక కూడా దున్న ఒకటి ఉంది. ఒక యాక్షన్ సీక్వెన్స్ లోని స్టిల్ లా కనిపిస్తోంది. ఈ సినిమా కోసం ఒళ్లు పెంచాడు. గడ్డం పెంచాడు. ఇప్పటి వరకూ తను కనిపించిన లుక్ నుంచి పూర్తిగా ఓ కొత్త మేకోవర్ కు వచ్చేశాడు.

ఇది నిజంగా అభినందించాల్సిన విషయమే. కొన్ని కథల్లో సెట్ అవడానికి ఫిట్ నెస్ విషయంలో మార్పులు చేర్పులు చేసుకోవడం మన హీరోలకు మామూలే. కానీ ఇలాంటి లుక్ అంటే కాస్త ధైర్యం చేశారనే చెప్పాలి. ఏదేమైనా ఫస్ట్ థండర్ అంటూ వస్తోన్న ఈ వీడియోతో ఈ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా రాబోతోంది అనేదానికి ఓ క్లారిటీ వస్తుంది.

ఇంకా టైటిల్ కూడా పెట్టని ఈ చిత్రంలో రామ్ సరసన శ్రీ లీల(Sri Leela) హీరోయిన్ గా నటిస్తోంది. బస్ స్టాప్(Bus Stop), రొమాన్స్(Romance)డిజే టిల్లు (DJ Tillu) వంటి చిత్రాలతో ఆకట్టుకున్న హీరో ప్రిన్స్(Prince) ను ఈ చిత్రంతో విలన్ గా పరిచయం చేస్తున్నాడు బోయపాటి. ఇక దసరా సందర్భంగా అక్టోబర్ 20న తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియన్(Pan Indian) సినిమాగా ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.
