బాలయ్యతో లోక నాయకుడు

కొందరు హీరోల సినిమాలకే కాదు.. వారు చేసే ప్రతి విషయానికీ భారీ హైప్ వస్తుంది. అలా తెలుగులో బాలకృష్ణ సినిమా అంటే చాలు.. భారీ హంగామా కనిపిస్తుంది. ఆ హంగామా సినిమాలకే కాదు.. షోస్ కు కూడా ఉంటుందని ఆహాలో మొదలైన అన్ స్టాపబుల్ టాక్ షోకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే అర్థమైంది. ఇప్పటికే ఒక సీజన్ ముగించుకున్న ఈ షో ఇప్పుడు సెకండ్ సీజన్ లో ఉంది.

ఈ టాక్ షోకు వస్తోన్న గెస్ట్ లతో ఎంతో వినోదాన్ని పంచుతున్నాడు బాలయ్య. ప్రభాస్ ఎపిసోడ్ లో చూసిన ఎంటర్టైన్మెంట్ ఏ సినిమాలో దొరుకుతుందీ..? అయితే ఈ సారి ఓ టాప్ తమిళ్ హీరోను తీసుకువస్తున్నారట. అందుకు కారణం.. ఆయన కూతురు బాలయ్య హీరోయిన్ అంటున్నారు. మరి ఆ హీరో ఎవరో గెస్ చేశారు కదూ..?


అన్ స్టాపబుల్.. టైటిల్ కు తగ్గట్టుగానే దూసుకుపోతోంది. ఎప్పుడూ సినిమావాళ్లతో.. అప్పుడప్పుడూ పొలిటీషియన్స్ తో సాగుతోన్న ఈ షోను గెస్ట్ లతో సంబంధం లేకుండా ఎంటర్టైనింగ్ మలిచిన ఘనత బాలయ్యదే. ఇప్పటి వరకూ తనపై ఇమేజ్ కు భిన్నమైన బాలయ్య ఈ షోలో కనిపిస్తుండటంతో చాలామంది ఆయనకు కొత్తగా అభిమానులయ్యారు.

ఆయన కోసమే ఆహాను సబ్ స్క్రైబ్ చేసుకున్నవారూ ఉన్నారు. ప్రస్తుతం సెకండ్ సీజన్ లో ఉన్న అన్ స్టాపబుల్ కు ఈ సారి ఓ క్రేజీ గెస్ట్ వస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. పాత్ర ఏదైనా, ఘట్టం ఏదైనా ఆయన చేస్తే అది అద్భుతం అవుతుంది. సినిమాను శ్వాసించే అతి కొద్దిమందిలో కనిపించే హీరో అతను.. అందుకే ఆయన్ని లోక నాయకుడు అంటున్నారు. యస్.. ఆ గెస్ట్ మరెవరో కాదు.. లోక నాయకుడు కమల్ హాసన్. అయితే ఇది ఇంకా కన్ఫార్మ్ కాలేదు. బట్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయంటున్నారు. అందుకు కారణం వీరసింహారెడ్డి మూవీ టీమ్.

నిజానికి పవన్ కళ్యాణ్‌ ఎపిసోడ్ తర్వాత ఈ సీజన్ ను ముగిస్తారు అనే ప్రచారం జరిగింది. అది సంక్రాంతికి స్ట్రీమ్ అవుతుందని కూడా భావించారు. బట్ పవన్ ఎపిసోడ్ ను నెలాఖరుకు పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఈ గ్యాప్ లో వీర సింహారెడ్డి మూవీ టీమ్ తో ఓ స్పెషల్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారు. ఆ ప్లానింగ్ లో భాగంగా శ్రుతి హాసన్ తో పాటు కమల్ హాసన్ ను కూడా రప్పించే ప్రయత్నాలు చేస్తోంది టీమ్.

ఆదిత్య 369 టైమ్ నుంచీ బాలయ్యకూ, కమల్ కు మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ కారణంగా లేదా శ్రుతి కోసమైనా కమల్ వస్తాడు అనుకుంటున్నారు. ఇదే నిజమైతే.. అన్ స్టాపబుల్ ఈ సారి తెలుగుతో పాటు తమిళ్ లో కూడా దుమ్మురేపుతుందని చెప్పొచ్చు.

Related Posts