రామ బాణం టార్గెట్ ను ఛేదిస్తుందా ..?

మేచో స్టార్ గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ లో వస్తోన్న మూడో సినిమా రామబాణం. వచ్చే శుక్రవారం ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అయితే హీరోతో పాటు దర్శకుడు కూడా ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్నారు. బట్ కాంబినేషన్ కి ఒక క్రేజ్ ఉంది. పైగా వీరి కాంబో లో వచ్చిన ఫస్ట్ మూవీ లక్ష్యం లోని జగపతి బాబు కూడా ఇందులో మరోసారి గోపీచంద్ కు అన్నగా నటించాడు.

అతని జోడీగా ఖుష్బూ చేసింది. గోపి సరసన డింపుల్ హయతి హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో దాదాపు అందరు ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన స్టేజ్ లో ఉన్నారు. ఇప్పుడున్న సిట్యుయేషన్ చూస్తోంటే వీళ్ళు చాల కాన్ఫిడెంట్ గానే కనిపిస్తున్నారు. కానీ ప్రేక్షకుల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. అందుకే భారీ ఓపెనింగ్స్ కోసం మూవీ టీం అంతే ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో గోపీచంద్ మూవీకి ఇంట అగ్రెసివ్ ప్రమోషన్ చూడలేదు. పైగా తేజకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో గోపీచంద్ చాల నమ్మకంగా హిట్ కొట్టబోతున్న అని చెప్పాడు. ఫామిలీ ఎమోషన్స్ తో పేరు యాక్షన్ కూ స్పేస్ ఉన్న మూవీగా చెబుతున్నాడు. అంటే తన ఇమేజ్ కు తగ్గట్టుగానే ఓ మంచి కథతో వస్తున్నా అంటున్నారు

.
గోపీచంద్ యెంత టాలెంటెడ్ అనేది అందరికీ తెలుసు. ఆ టాలెంట్ తెరపైనే కాదు.. స్టోరీ సెలక్షన్ లో కూడా చూపించాలి. అప్పుడే సక్సెస్ వస్తుంది. బట్ ఈ విషయం లో గోపి చాల వీక్ గా ఉన్నాడు అని అతని గత చిత్రాలు చూస్తే తెలుస్తోంది. కేవలం తన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథలకే ఓకే చెప్పాడు.

కానీ ఇప్పుడు ఇమేజ్ లను దాటి చేస్తోన్న హీరోలు కూడా విజయం సాధిస్తున్నారు అని తెలియడం లేదు. ఆరు పాటలు నాలుగు ఫైట్స్ అనే ఫార్ములా కు కాలం చెల్లింది అని చెప్పలేం కానీ ఎప్పుడూ అవే చేస్తే మొనాటనీ వస్తుంది కదా. అదే గోపీచంద్ కు జరుగుతోంది.రామబాణం ట్రైలర్ చూసినప్పుడు ఇది కూడా ఫార్ములాలోనే తీసిన సినిమా అనిపిస్తోంది. ఫార్ములా లోనే అయినా కథనం ఆకట్టుకునేలా ఉంటే ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఆ నమ్మకంతోనే మూవీ టీమ్ అంతే ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తోంది. మరి వీరి కష్టానికి తగ్గ ఫలితం రావాలని కోరుకుందాం.

Related Posts