NTR : ఇంతమందిలో ఎన్టీఆర్ పలచన అయిపోతాడేమో..?

నందమూరి తారకరామారావు.. తెలుగు నేలపై చరిత్ర సృష్టించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పుట్టి వందేళ్లైన సందర్భంగా గతేడాది నుంచే శత జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు.

రీసెంట్ గా ఈ శత జయంతి ఉత్సవాల ముగింపు సభ విజయవాడలో జరిగింది. తెలంగాణలో ఈ శనివారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం చాలామంది ఆసక్తిగా చూసిన జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఆహ్వానం అందింది. అయితే ఈ ఆహ్వానం అతనికి మాత్రమే కాదు.. ఇంకా చాలామందికి ఉంది. అందులో పవన్ కళ్యాణ్‌, ప్రభాస్, అల్లు అర్జున్‌, రామ్ చరణ్‌ లు కూడా ఉన్నారు.

ఇంతమందిలో ఎన్టీఆర్ ఖచ్చితంగా పలచన అవుతాడు అనేది ఆయన అభిమానుల భావన. అలా కావాలనేదే నిర్వాహకుల కోరిక అనేలా కొత్త కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదేంటీ అనుకుంటున్నారు కదూ.. ? అందుకు ఓ కారణం ఉంది.
ఇంతకు ముందు విజయవాడలో సభ జరిగినప్పుడు జూనియర్ కు ఆహ్వానం లేదు అని చాలామంది అనుకున్నారు. బట్ అతన్ని ఇన్వైట్ చేశారు. కానీ వెళ్లలేదు. అందుకు కారణం.. అంతకు ముందే గుడివాడ కేంద్రంగా జరిగిన రాజకీయ పరిణామాలే అనేది అంతా చెప్పే సత్యం.

సభకు కొన్ని రోజుల ముందు గుడివాడ అభివృద్ధి, నిమ్మకూరు అభివృద్ధిపై చంద్రబాబు నాయుడు, కొడాలి నాని మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆ వెంటనే నిర్వహించిన ఈ సభకు ఎన్టీఆర్ వెళితే ఆయన స్నేహితుడైన కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ కూడా బాధపడతాడు అనే జూనియర్ పెద్దాయన శతజయంతి ఉత్సవాల ముగింపు సభకు వెళ్లలేదు అని టిడిపి వాళ్లు చెప్పే వెర్షన్. అదే టైమ్ లో ఈ వేడుకకు తనకు ఆహ్వానం లేదు అని కానీ, ఉంది అని కానీ చెప్పలేదు. ఇదీ కొంత కన్ఫ్యూజన్ కు కారణమైంది.


ఇక హైదరాబాద్ సభకు అతన్ని ఇన్వైట్ చేసినట్టుగా ఏకంగా ఫ్లెక్సీలే కొట్టించి పెట్టారు. బట్ అతనితో పాటు వచ్చే గెస్ట్ లను చూస్తే ఎన్టీఆర్ కు పెద్దగా ఏ ప్రత్యేకతా ఇవ్వడం లేదు అనే విషయ అర్థం అవుతోంది. అంటే గతంలో పిలిచిన విషయం ఎవరికీ తెలియదు. ఇప్పుడు పిలిచీ పలచన చేయడం అనే కోణంలో కొందరు విశ్లేషిస్తున్నారు. మరి దీనికి ఎన్టీఆర్ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి.

Related Posts